#స‌ర్కారు వారు.. మామా మ‌హేషా ముస్తాబైంది పోరీ..!

Update: 2022-05-06 14:16 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టించిన `స‌ర్కార్ వారి పాట` మే 12న అత్యంత భారీగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ ప్యారిస్ వెకేష‌న్ నుంచి తిరిగి రాగానే ప్ర‌మోష‌న్స్ లో జాయిన్ కానున్నారు. ఈలోగానే స‌ర్కార్ వారి పాటకు ప‌ర‌శురామ్ అండ్ టీమ్ బోలెడంత ప్ర‌చారం తెస్తున్నారు. ఇప్ప‌టికే టైటిల్ లిరిక‌ల్ సాంగ్ అభిమానుల్లో వైర‌ల్ అయ్యింది. క‌ళావ‌తి సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

సూప‌ర్ స్టార్స్ MENTAL MASS SWAG అంటూ ట్రైల‌ర్ లో సూప‌ర్ స్టార్ కి చెందిన 105 మాస్ షాట్స్ ని చూపించారు. #SVP ట్రైల‌ర్ షాట్స్ మంట‌లు పెట్టేసిన సంగ‌తి తెలిసిందే.  మే 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా స‌ర్కార్ వారి పాట విడుద‌ల కానుంది. ఈ సినిమా కోసం మ‌హేష్ అభిమానులు ఎంతో ఆత్రంగా వేచి చూస్తున్నారు.

తాజాగా మామా మ‌హేష్ ముస్తాబ‌య్యాను అంటూ మాస్ బీట్ తో అదిరిపోయే సాంగ్ అభిమానుల ముందుకు వ‌చ్చింది. మ‌హేష్ న‌టించిన ప్ర‌తి సినిమాలో ఇలాంటి ఓ స్పెష‌ల్ మాస్ బాణీ చార్ట్ బ‌స్ట‌ర్ల‌లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అదే తీరుగా థ‌మ‌న్ మ‌రో చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్ ని అందించారు. ఈ పాట‌లో మ‌హేష్ - కీర్తి మ‌ధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. కీర్తి ఎన‌ర్జిటిక్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టేయ‌గా మ‌హేష్ కూడా ఈసారి స్టెప్పుల్లో సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తున్నారు. ముఖ్యంగా అత‌డి ఛామింగ్ లుక్ క‌ల‌ర్ ఫుల్ డ్రెస్సుల కాంబినేష‌న్ ఎంతో ఆస‌క్తిని క‌లిగిస్తోంది.











Full View
Tags:    

Similar News