తనను, తన తల్లిని అసభ్య పదజాలంతో దూషించిన శ్రీరెడ్డి - అందుకు ప్రేరేపించిన వర్మపై ఈ రోజు ఉదయం కల్లా `మా `ఒక నిర్ణయం తీసుకోవాలని జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్ లో టాలీవుడ్ లోని 24 క్రాఫ్ట్స్ కు చెందిన 74 మంది సినీ పెద్దలు హాజరయ్యారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం కొద్ది సేపటి క్రితమే ముగిసింది. అయితే, ఈ సమావేశం పూర్తయిన తర్వాత మీడియాతో మాట్లాడకుండానే సినీ పెద్దలు వెళ్లిపోయారు. వాస్తవానికి, ఈ సమావేశానికి పవన్ కల్యాణ్ కూడా హాజరవుతారని భావించారు. అయితే, భద్రతా కారణాల రీత్యా పవన్ హాజరు కాలేదు. అయితే, ఈ రోజు ఏదో ఒక సమయంలో 24 క్రాఫ్ట్స్ కు చెందిన ప్రతినిధులతో పవన్ సమావేశం అవుతారని, కొద్ది సేపట్లో సమావేశం ఎక్కడ జరిగేది ప్రకటిస్తారమని జనసేన వర్గాలు తెలిపాయి.
'మా' అధ్యక్షులు శివాజీ రాజా, నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, కేయస్ రామారావు, దానయ్య,ఘట‍్టమనేని ఆదిశేషగిరిరావు, ఠాగూర్ మధు, అశోక్ కుమార్, సీ కల్యాణ్, యన్ వి ప్రసాద్, వంశీ పైడిపల్లి, నరేష్, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, హరీష్ శంకర్, జెమినీ కిరణ్ తదితరులతో పాటు 24 క్రాఫ్ట్స్ కు చెందిన పలువురు ప్రముఖులంతా హాజరయ్యారు. అయితే, ఈ సమావేశానికి పవన్ కల్యాణ్ కూడా వస్తారన్న ప్రచారం సాగడంతో ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో అన్నపూర్ణ స్టూడియోస్ కు చేరుకున్నారు. దీంతో, పరిస్థితులు అదుపుతప్పేలా ఉండడంతో పవన్ సమావేశాన్ని మాత్రమే రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఏదో ఒక సమయంలో 24 క్రాఫ్ట్స్ కు చెందిన వారితో పవన్ ప్రత్యేకంగా సమావేశం అవుతారని, ఎక్కడ నిర్వహించే విషయంపై కాసేపట్లో ప్రకటన వెలువరిస్తామని జనసేన వర్గాలు తెలిపాయి. మరోవైపు, సినీ పెద్దల సమావేశం పూర్తయిన తర్వాత వారు మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. కాగా, ఈ రోజు సాయంత్రం 4గంటలకు సచివాలయంలో ఈ వ్యవహారం పై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి కొన్ని కీలక నిర్ణయాలను ప్రభుత్వం తరఫున ప్రకటిస్తారని కూడా తెలుస్తోంది.