ముగిసిన మా ఎన్నికలు.. 25 ఏళ్లలోనే రికార్డు పోలింగ్.. గెలుపెవరిది?

Update: 2021-10-10 10:44 GMT
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు మూడు గంటలకు ముగిశాయి. పాతికేళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో ఓటింగ్ జరిగింది. ఓటింగ్ కు వచ్చిన సభ్యులను చూసి ఓటింగ్ ను మరో గంట పాటు 3 గంటల వరకు పొడిగించారు. పాతికేళ్ల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా రికార్డ్ స్థాయిలో ఓటింగ్ నమోదైంది. దాదాపు 72శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 626 ఓట్లు పోల్ అయితే.. 60 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయి. తొలి రెండు గంటల్లోనే 250 ఓట్లు పోలయ్యాయి.

ఆదివారం ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు మా పోలింగ్ కొనసాగుతుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఫలితాలను కూడా ఇదే రోజు రాత్రి ప్రకటిస్తారు. రాత్రి 8 గంటలలోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.మొట్టమొదటగా మా ఎన్నికల్లో పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ ఓటు వేశాడు. ఆ తర్వాత వరుసగా చిరంజీవి, రాంచరణ్, బాలక్రిష్ణ, నరేశ్, సాయికుమార్, శివాజీరాజా, సుడిగాలి సుధీర్ సహా సినీ ప్రముఖులు అంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మా ఎన్నికల్లో ఉదయం అందరికంటే ముందు వచ్చిన పవన్ తో నటుడు మోహన్ బాబు ఏకాంతంగా పక్కకు తీసుకెళ్లి మాట్లాడారు. ఇటీవల జగన్ సర్కార్ ను విమర్శిస్తూ 'మోహన్ బాబు'ను ఇన్ వాల్వ్ చేసి ఎందుకు ప్రశ్నించరని పవన్ అడిగిన సంగతి తెలిసిందే. దీనికి మోహన్ బాబు కౌంటర్ ఇస్తానన్నాడు. మా పోలింగ్ వేళ వీరిద్దరూ ఏకాంతంగా చర్చించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

మధ్నాహ్నం 2 గంటలకే పూర్తి కావాల్సిన ఓటింగ్ కు ఈసారి ఓటర్లు పోటెత్తడంతో క్యూలైన్లో ఉన్న వారికి అవకాశం కల్పించి మరో గంటపాటు వ్యవధిని ఎన్నికల అధికారి పొడిగించారు. ఈ క్రమంలోనే 3 గంటలకు పోలింగ్ ముగియగా.. కౌంటింగ్ ప్రారంభమైంది.

మొత్తం 915మంది 'మా' సభ్యులుండగా 883 మందికి ఓటు హక్కు ఉంది. గత ఎన్నికల్లో 474 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈసారి అంచనాలను మించి ఓట్లు పోలయ్యాయి. ఎన్నడూ లేని విధంగా వివిధ ప్రాంతాలు, నగరాల నుంచి 'మా' సభ్యులు విమానాల్లో వచ్చి మరీ ఓట్లు వేయడం విశేషం. క్యూలైన్లో, ట్రాఫికల్ లో ఉన్న వారికి కూడా పోలింగ్ కు అనుమతించారు.

'మా' ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ ప్రధానంగా పోటీపడుతున్నాయి. రెండు వర్గాలు కొద్దిరోజులుగా విమర్శలు, ప్రతి విమర్శలతో రెచ్చిపోయారు. తాజాగా ఎన్నికల వేళ కూడా ప్రకాష్ రాజ్-నరేశ్, శివబాలాజీ-హేమ, మోహన్ బాబు-బెనర్జీలు దాదాపు తిట్టుకొని కొట్టుకునేంత పనిచేశారు. ఎన్నికల వేళ ప్రాంగణం అంతా రచ్చరచ్చ అయ్యింది. ఇక మీడియా ఎదుట మాత్రం ప్రకాష్ రాజ్-మంచు విష్ణు భుజంపై చేయివేసుకొని ఫొటోలకు నవ్వుతూ ఫోజులివ్వడం విశేషం.

ఉదయం మంచు విష్ణు, ప్రకాష్ రాజులు హగ్ చేసుకొని సామరస్యంగానే కనిపించారు.నరేశ్ కూడా అక్కడే పక్కనే ఉండి నవ్వులు చిందించారు. తాజాగా ఇద్దరూ బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సంచలనమైంది. ఇదంతా చూసిన వాళ్లు మా ఎన్నికలు జనరల్ ఎన్నికలను తలపిస్తున్నాయని కామెంట్స్ చేశారు.

ఈరోజు మా ఎన్నికల పోలింగ్ లో భాగంగా నటుడు నరేశ్, ప్రకాష్ రాజ్ మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది.  ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎవరూ ఊహించని విధంగా మా సభ్యులు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఈ వాగ్వివాదం నేపథ్యంలోనే సీనియర్ నటుడు నరేశ్, ప్రకాష్ రాజ్ మధ్య కూడా గొడవ జరిగింది.దాదాపుగా నరేశ్, ప్రకాష్ రాజ్ లు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ కొట్టుకోవడానికి రెడీ అయ్యారు.

 గత మూడు పర్యాయాలుగా 'మా' ఎన్నికలు పోటీపోటీగా సాగుతున్నాయి. గత మూడు సార్లు ఎవరూ ఓటు వేయడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొనగా ఈసారి మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ల గట్టి ప్రయత్నాలతో సినీ ప్రముఖ నటులు  ఓటు హక్కు వినియోగించుకున్నారు. 'మా' ఎన్నికల్లో 72శాతం పోలింగ్ నమోదైంది. మా చరిత్రలో గత 25 ఏళ్లలోనే ఇది అత్యధికం. 883  మంది మా సభ్యుల్లో 626 ఓట్లు ఈసారి పోలయ్యాయి.

పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు ముగిసింది. అయితే ఎంతో మంది చిన్న, పెద్ద నటులు ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు రాగా స్టార్ హీరోలు మాత్రం ఈ ఎన్నికలకు దూరంగా ఉండడం గమనార్హం. ఇప్పటివరకు ఓటు వేసేందుకు స్టార్ హీరోలు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, వెంకటేశ్, నాగచైతన్య, రానాలు రాలేదు. వీళ్లు ఇంత రచ్చ జరుగుతున్న ఎన్నికలను పట్టించుకోకుండా ఓటు వేసేందుకు రాకపోవడం విశేషం.

-కౌంటింగ్ ఏర్పాట్లు చేసిన మురళీ మోహన్, మోహన్ బాబు
ఇక పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బ్యాక్సులను దగ్గరుండి మురళీ మోహన్, మోహన్ బాబులు కౌంటింగ్ లెక్కింపు కేంద్రానికి తరలించారు. పోలీసులతో చెప్పి 'మా' ఎన్నికల్లో పోటీచేసిన ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ వారిని తప్ప అందరినీ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించారు. ఓట్ల లెక్కింపును చేపట్టారు. రాత్రి 8 గంటల లోపు ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.
Tags:    

Similar News