#MAA కొత్త అధ్య‌క్షుడు కొత్త సోష‌ల్ మీడియా

Update: 2021-11-06 06:59 GMT
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) కొత్త అధ్య‌క్షుడు మంచు విష్ణు దూకుడు గురించి తెలిసిన‌దే. ఆయ‌న అసోసియేష‌న్ లో త‌న‌దైన మార్క్ పాల‌న‌కు శ్రీకారం చుట్టారు. యూనిక్ నెస్ తో త‌న ఉనికిని చాటుకునేందుకు విష్ణు త‌పిస్తున్నారు. సంక్షేమ కార్యక్ర‌మాలు స‌హా `మా` సొంత‌ భ‌వంతి నిర్మాణం కోసం ఈసారి విష్ణు క‌సిగా ప‌ని చేయ‌నున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం అసోసియేషన్ లో జరిగే అన్ని వ్యవహారాలను విష్ణు చురుకుగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. తాజాగా MAA కొత్త సోషల్ మీడియా హ్యాండిల్స్ ను కొత్త అధ్య‌క్షుడు ప్రకటించారు. ఇక‌ మా అసోసియేష‌న్ కార్య‌క‌లాపాల‌న్నిటినీ ఈ వేదిక‌పై తెలియ‌జేస్తారు. దీపావళి సందర్భంగా మంచు విష్ణు MAA కొత్త సోషల్ మీడియా హ్యాండిల్స్ ను ట్విట్టర్.. ఫేస్ బుక్ ... ఇన్ స్టాగ్రామ్ లు స‌హా ఇత‌ర మీడియాల్ని ప్రారంభించారు. మీకు మీ ప్రియమైన వారికి దీపావళి శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన రోజున ఎంతో గర్వంగా #MAA సోషల్ మీడియా హ్యాండిల్స్ ను లాంచ్ చేస్తున్నామ‌ని విష్ణు తెలిపారు. ఆ లింక్ లను షేర్ చేశారు.

ప్ర‌స్తుతానికి ఈ వేదిక‌లపై ఆర్టిస్టులు చేర‌నున్నారు. ఇంత‌కుముందు జ‌రిగిన‌ MAA ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ను ఓడించి అసోసియేషన్ ని విష్ణు హ‌స్త‌గ‌తం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల వేళ మా ఆసోసియేష‌న్ సొంత భ‌వంతికి స్థ‌లాలు రెడీ చేసాన‌ని ప్ర‌క‌టించారు. ఆర్టిస్టుల నుంచి అణా పైసా తీసుకోకుండా భ‌వంతిని త‌న సొంత డ‌బ్బుతో నిర్మిస్తాన‌ని ప్రామిస్ చేశారు. ఆ రెండిటి భ‌రోసా విష్ణుదే. దీనిపై కీల‌కమైన ప్ర‌క‌ట‌న‌తో ఆయ‌న వ‌స్తార‌ని అంతా వేచి చూస్తున్నారు. తాజాగా ప్రారంభించిన సోష‌ల్ మీడియాల్లో `మా` సొంత భ‌వంతి నిర్మాణంపై ప్ర‌స్థావిస్తారేమో వేచి చూడాలి. మోస‌గాళ్లు ఫ్లాప్ అయ్యాక కెరీర్ ప‌రంగా విష్ణు గ్యాప్ తీసుకున్నారు. మంచి స్క్రిప్టుల కోసం వేచి చూసారు. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న డి అండ్ డి చిత్రంలో న‌టిస్తున్నారు. మ‌రిన్ని స్క్రిప్టుల్ని లాక్ చేయ‌నున్నార‌ని తెలిసింది.


Tags:    

Similar News