ఒకే టైటిల్ తో వస్తున్న మాజీ హీరోయిన్లు

Update: 2017-03-16 17:53 GMT
బాలీవుడ్ మాజీ హీరోయిన్ రవీనా టాండన్.. అప్పుడప్పుడు సినిమాల్లో సందడి చేస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలో గెస్ట్ రోల్స్ సరిపెట్టుకుంటున్న ఈ సీనియర్ బ్యూటీ.. ఇప్పుడు ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

"మాత్ర్ - ది మదర్" అనే టైటిల్ పై రూపొందిన చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తోంది రవీనా. ఇప్పుడీ చిత్రానికి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. న్యాయాధిపతి  కుర్చీలో న్యాయదేవత విగ్రహం పక్కకు పడిపోయిన పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలు.. హింస.. లైంగిక దాడులపై ప్రధానంగా ఫోకస్ చేశారు. మాత్ర్ - ది మదర్ మూవీలో విలన్ గా స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్ మాధుర్ మిట్టల్ నటించడం విశేషం. ఈ చిత్రం ఏప్రిల్ 21 న విడుదలకు సిద్ధమైంది.

మాత్ర్ అంటే అమ్మ అని అర్ధం. దాదాపు ఇదే టైటిల్.. కాకపోతే భాష వేరు అంతే. మామ్ టైటిల్ తో మరో మాజీ హీరోయిన్ శ్రీదేవి కూడా ఓ మూవీ చేసింది. ఇది ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఇలా కేవలం ఒక వారం తేడాలు ఇద్దరు మాజీ హీరోయిన్లు.. దాదాపు ఒకే టైటిల్ తో సినిమాలు రిలీజ్ చేసేస్తుండడంతో.. ఇండస్ట్రీ జనాల్లో ఆసక్తి నెలకొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News