17 ఏళ్ల తరువాత మళ్లీ ఆ కాంబో

Update: 2018-01-17 23:30 GMT
ఒక ఏడాదిలో ఎన్నో వేల సినిమాలు వెండితెరపై అలా ఆడి అలా వెళ్లిపోతున్నాయి. ఎంత పెద్ద సినిమా అయినా ఎంత చిన్న సినిమా అయినా కరెక్ట్ గా ఒక వారం ఆడితే చాలు అనుకుంటున్నారు నిర్మాతలు కూడా. ప్రేక్షకులు కూడా లేట్ గా కాకుండా సినిమాను మ్యాక్సీమమ్ మొదటి మూడు రోజుల్లోనే చూసేస్తున్నారు. ఇక రెండవసారి అంటే కష్టమే. మొదటి సారి చూసినపుడు కూడా పాట వస్తే బయటకి వెళ్లి ఓ దమ్ము వేసి రావడం బి సెంటర్లలో లో ఇప్పటికి జరుగుతూనే ఉంది.

కానీ కొన్ని సార్లు కొన్ని సినిమాలు తెరకెక్కిన విధానానికి ఒక్కో సారి ప్రేక్షకుడు ఫిదా అయిపోతున్నాడు. సినిమా పాట వస్తే కూడా కదలడం లేదు. అలాంటి సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిలో చెలి సినిమా ఒకటి. 2001 లో మాధవన్ - అబ్బాస్ అలాగే రీమా సేన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఆ సినిమా ఆ రోజుల్లో సంచలన విజయాన్ని అందుకుంది.

మాస్ యాక్షన్ సినిమాలు ఎక్కువగా ఇష్టపడుతోన్న ప్రేక్షకులకు ఒక్కసారిగా చెలీ రొమాంటిక్ టచ్ ని ఇచ్చింది. సంగీత దర్శకుడు హరిస్ జై రాజ్ కూడా ఆ సినిమాతోనే పరిచయం అయ్యాడు. ఆ సినిమాలో పాటలు ఇప్పుడు కూడా చాలా పాపులర్.  సినిమాని తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ వరుస విజయాలతో ఉన్నపుడు చెలీ సినిమా విజయం మంచి ఉపును ఇచ్చింది. దీంతో ఆ సినిమా అందరికి మంచి లాభాలను అందించింది. ఆ రొమాంటిక్ మ్యూజికల్ ఫిల్మ్ తరువాత మాధవన్ కూడా చాలా బిజీ అయ్యాడు.

ఇక అసలు విషయానికి వస్తే.. మాధవన్ - గౌతమ్ మీనన్ కాంబినేషన్ మళ్లీ సెట్ కానుందని సమాచారం. కోలీవుడ్ లో ప్రస్తుతం ఈ న్యూస్ చాలా హాట్ టాపిక్ అయ్యింది. కరెక్ట్ గా 17 ఏళ్ల తరువాత మళ్లీ ఆ జోడి కలవనుందని అక్కడి సినీ ప్రముఖులు కూడా చర్చించుకుంటున్నారు. అన్ని సెట్ అయితే త్వరలోనే దర్శకుడు ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలియజేస్తాడాని సమాచారం.



Tags:    

Similar News