కోటి పుచ్చుకుని విలన్ అయిన లవర్

Update: 2017-12-21 17:30 GMT
ఒకవైపు టాలీవుడ్ ఫ్యామిలీ హీరో జగపతి బాబు.. తమిళ్- మలయాళ సినిమాల్లో కూడా విలన్ గా మారిపోతున్నాడు. పెద్ద హీరోలు.. భారీ బడ్జెట్ సినిమాల్లో విలన్ రోల్స్ తో ఆకట్టుకుంటున్నాడు. మరోవైపు ఇతర భాషల సీనియర్ హీరోలను తెలుగులో విలన్స్ గా నటింపచేస్తున్నారు టాలీవుడ్ మేకర్స్.

ఇప్పటికే క్యూట్ హీరో ఇమేజ్ ఉన్న  అరవింద్ స్వామి.. యాక్షన్ కింగ్ అర్జున్ లు తెలుగులో విలన్స్ గా సత్తా చాటేశారు. గతంలో లవర్ బోయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న మాధవన్ ను విలన్ గా చూపించేస్తున్నారు. ఇందుకోసం సవ్యసాచి మేకర్స్ ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ ముట్ట చెప్పారని తెలుస్తోంది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో.. విలన్ పాత్రకు విపరీతమైన ఇంపార్టెన్స్ ఉంటుందట. కథకు ఈ పాత్ర చాలా కీలకం అని అంటున్నారు. అలాగే ఈ పాత్ర తీరుతెన్నులు కూడా అద్భుతంగా ఉంటాయని అంటున్నారు.

అందుకే విలన్ రోల్ అయినా సై అన్నాడట మాధవన్. ప్రస్తుతం ఈ క్యారెక్టర్ ను తీర్చిదిద్దుతున్న తీరుపై కూడా పూర్తి సంతృప్తిగా ఉన్నాడట ఈ మాజీ లవర్ బోయ్. క్యారెక్టర్ నచ్చడంతో పాటు.. ఇటు కోటి రూపాయల రెమ్యూనరేషన్ కూడా మాధవన్ ను ఆకట్టుకుందని అనడంలో సందేహం లేదు. ప్రస్తుత సిట్యుయేషన్స్ లో హీరో పాత్రతో ఈ మొత్తాన్ని అందుకోవడం కష్టమే. కానీ విలన్ గా మాత్రం భారీగా పారితోషికం పలువురికి ముట్టుతోంది.
Tags:    

Similar News