మాధ‌వ‌న్ తో న‌య‌న‌తార రొమాన్స్!

Update: 2022-11-12 23:30 GMT
స్టార్ హీరో మాధ‌వ‌న్ 52 ఏళ్లకు చేరుకునే స‌రికి పాత్ర‌ల ప‌రంగా ఛెంజెస్ తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌లు చేస్తూ మెప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇటీవ‌లే నంబి  ఎఫెక్ట్ లో నంబీ నార‌య‌ణ్ పాత్ర లో క‌నిపించి ఆద్యంతం మెప్పించారు.  నంబీ నారాయ‌ణ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన సినిమా మాధ‌వ‌న్ కి  కొత్త రకమైన ఐడెంటిటీని తీసుకొచ్చింది.

ల‌వ‌ర్ బోయ్ గా క‌నిపించే మాధ‌వ‌న్ తొలిసారి వైవిథ్య‌మైన పాత్ర‌లో  క‌నిపించేస‌రికి అభిమానులు సైతం ఒకింత ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. దీంతో మాధ‌వ‌న్ సెకెండ్ ఇన్నింగ్స్  లో ఈ త‌ర‌హా పాత్ర‌ల‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తార‌ని చాలా మంది భావించారు. కానీ ఆయ‌న బ్యాక్ టూ పెవిలియ‌న్ అంటూ మ‌ళ్లీ మునుప‌టి రంగునే పులుకుంటున్న‌ట్లు క‌నిపిస్తుంది.

ప్ర‌స్తుతం మాధ‌వ‌న్ బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. వాటి సంగ‌తి ప‌క్క‌న‌బెడితే తాజాగా శ‌షి కాంత్ అనే కొత్త కుర్రాడితో సినిమా చేయ‌డానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇందులో  రొమాన్స్ కి సైతం ప్రాధాన్య‌త ఉన్న క‌థ అని స‌మాచారం. కాగా ఇందులో హీరోయిన్ గా న‌య‌న‌తార‌ని తీసుకున్న‌ట్లు కోలీవుడ్  వ‌ర్గాల స‌మాచారం.

న‌య‌న్ ఇమేజ్ స‌హా ఆ పాత్ర‌కు ఆమె అయితేనే న్యాయం చేస్తుంద‌ని భావించి మాధ‌వ‌న్..శ‌షి అమెని క‌న్విన్స్ చేసిన‌ట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలో కంటెంట్ ప‌రంగా రొమాన్స్ కి ఛాన్స్ ఉంది కాబ‌ట్టి న‌య‌న్ -మాధ‌వ‌న్ మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశాల‌కు కొద‌వ‌డుంద‌ని అభిమానులు గెస్ చేస్తున్నారు. ఇక‌ ఈ హాట్ బ్యూటీ ఇంత‌వ‌ర‌కూ మాధ‌వ‌న్ స‌ర‌స‌న న‌టించింది లేదు.

తొలిసారి ఆ ఛాన్స్  అందుకుంది. మాధ‌వ‌న్ తో  తెర‌ను పంచుకోవాల‌ని ఎంతో మంది బ్యూటీలు క్యూలో ఉంటారు.  కానీ ఆ ఛాన్స్ ఇప్పుడు న‌య‌న్ ని వ‌రించింది. మ‌రి మ్యాడీతో అమ్మ‌డు రొమాన్స్ తెర‌పై ఎలా ఉంటుందో  చూడాలి. ఇటీవ‌లే న‌య‌న్ వివాహం చేసుకున్న సంగ‌తి  తెలిసిందే.

పిల్ల‌ల్ని ద‌త్త‌త తీసుకుని త‌ల్లిగా బాధ్య‌త‌లు వ‌హిస్తుంది. మ‌రో వైపు భ‌ర్త చాటు భార్య‌గాను విధులు నిర్వ‌ర్తిస్తుంది. వృత్తిప‌రంగానూ ఎంతో బీజీ. ఇలా అన్ని ర‌కాలుగా న‌య‌న్ కెరీర్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తోంది. వ‌చ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. ఇద్ద‌రి పాన్ ఇండియా క్రేజ్ నేప‌థ్యంలో సినిమాని అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలిసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News