లాగించలేదు.. జస్ట్ తగిలించిందంతే

Update: 2015-11-25 07:30 GMT
పదేళ్ల నుంచి కెరీర్ కొనసాగిస్తున్నా.. మధుశాలినికి ఆశించిన బ్రేక్ రాలేదు. తెలుగు - తమిళ్ - కన్నడలతో పాటు బాలీవుడ్ లో నటించినా పెద్దగా ఒరిగిందేమీ లేదు. తెలుగులో చిరంజీవి - నాగ్ - పవన్ సినిమాల్లోనూ, బాలీవుడ్ లో అమితాబ్ మూవీలోనూ యాక్ట్ చేసినా భారీ ఆఫర్స్ మాత్రం తలుపు తట్టలేదు.

సీనియర్ హీరోయిన్ అని చెప్పుకునేంతటి సినిమాలున్న మధుశాలినికి ఇప్పుడిప్పుడే కాస్త చెప్పుకోదగ్గ పాత్రలు వస్తున్నాయి. గోపాలగోపాల తర్వాత.. లేటెస్ట్ గా రిలీజైన చీకటి రాజ్యంలోనూ మెరిసింది ఈ భామ. కమల్ హాసన్ మూవీలో నటించే ఆఫర్ రావడం.. కెరీర్ లోనే బెస్ట్ అని చెప్పుకోవాలి. విశ్వనటుడి పక్కన యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీలోనే.. మధుశాలినికి లిప్ లాక్ లాగించే అవకాశం చిక్కింది. ఇలా కమల్ హాసన్ తో ముద్దు పెట్టించుకున్నవాళ్లంతా పెద్ద  హీరోయిన్స్ అయ్యారనే ట్రాక్ రికార్డ్ ఒకటి ఉంది లెండి.

అయితే ముద్దు సీన్ చేయడంపై వస్తున్న కామెంట్స్ కి ఘాటుగానే స్పందించింది మధుశాలిని. అదేమన్నా ఫ్రెంచ్‌ కిస్సా.. ఇమ్రాన్ హష్మీ మూవీల్లో  బాపతుగా ముద్దులు లాగించడమా. కేవలం పెదాల మీద పెదాలు ఆనించిన పెక్‌ అంతే గదా అంటోందీ అమ్మడు. ఈ మాటలు వింటుంటే ఘాటు ముద్దు లాగించనందుకు ఫీలవుతున్నట్లు అనిపిస్తోంది కదూ? లేకపోతే ఇప్పటికింతే సరిపెట్టుకోండి అని చెబ్తోందా ?
Tags:    

Similar News