మొత్తానికి సెన్సార్ అయ్యింది

Update: 2017-07-26 04:43 GMT
మన దేశంలో అందరికి హక్కులు ఉన్నాయి ఆ హక్కులును వాడితే మనకు శిక్షలు కూడా  ఉన్నాయి. కాని కొన్ని సార్లు మన హక్కులను మనం వాడినందుకు కూడా మనకు గట్టి దెబ్బలు తగులుతాయి. మనకు స్వేచ్చ హక్కు ఉంది కానీ దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ విషయంలో రైటర్స్ - ఫిల్మ్ డైరెక్టర్స్  కు కొంత ఇబ్బందులు ఎదురుపడుతుంటాయి. ఎందుకంటే ఆ రెండు ప్రజలు పై ఎక్కువ ప్రభావం చూపుతాయి కాబట్టి వాటి పై ఆంక్షలు ఎక్కువ పెడతారు.

ఫిల్మ్ మేకర్ మధుర్ భండార్కర్ ‘ఇందు సర్కార్’ అనే ఒక పోలిటికల్ డ్రామా తీశాడు. ఈ సినిమా అప్పటి ఎమర్జెన్సీ రోజులలో ఒక భార్య భర్తల కథ అని చెబుతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుండి ఈ సినిమా పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇది ఇందిరా గాంధీ పై వ్యతిరేకంగా తీసిన సినిమా అని దీన్ని విడుదల చేయడానికి వీలులేదు అని కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు దాడికి దిగారు. అయితే మధుర్ భండార్కర్ ఈ సినిమాను CBFC వాళ్ళ ఆమోదం కోసం పంపారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉంచడం కుదరదు అని ఒక 14 సీన్లు తీసేయమని చెప్పారు ఆ కమిటీ సభ్యులు. దానికి మధుర్ భండార్కర్ కొంచెం అటు ఇటు చేసి మళ్ళీ పంపాడు అంట. దానితో CBFC విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ సంధర్భంగా మధుర్ భండార్కర్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకున్నాడు.

ఈ సినిమా అందరూ అనుకునట్లు ఇందిరా గాంధీ పై తీసిన సినిమా కాదు. ఎమర్జెన్సీ టైమ్ లో ఇద్దరు విరుద్ధ స్వభావాలు గల భార్య భర్తల మధ్య సంఘర్షణ అని తెలిపాడు. ఇందిరా గాంధీ పై పాత్ర ఈ సినిమాలో పెద్దగా లేనందు వలనే పోలిటికల్ డ్రామా పైగా ఎమర్జెన్సీ నేపధ్య సినిమా అయినా కూడా తొందరగానే ఆమోదం పొందింది అని అంటున్నారు. ఇందిరా గాంధీ పాత్ర ఈ సినిమాలో ఏమి ఉండదు అని తెలుస్తుంది. ఉన్న ఆమెకు వ్యతిరేకంగా అయితే ఉండబోదు అని చెబుతున్నారు ఇందు సర్కార్ చిత్ర యూనిట్.

ఈ సినిమాలో ఇందిరా గాంధీగా సుప్రియా వినోద్ నటిస్తుంది. సంజయ్ గాంధీ గా నీల్ నితిన్ ముకేష్ నటిస్తున్నాడు. అనుపమ్ ఖేర్ - తొతరాయ్ చౌధురి కూడ ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ శుక్రవారం ఇందు సర్కార్ సినిమా విడుదల కాబోతుంది. మధుర్ భండార్కర్ సినిమాలు అన్ని రియల్ లైఫ్ స్టోరీస్ అయి ఉంటాయి. సినిమా జీవితాలు పై, హీరోయిన్ జీవితాలు పై, మోడల్ జీవితాలు పై సినిమాలు తీసిన మధుర్ భండార్కర్ ఇప్పుడు పోలిటికల్ స్టోరీ తో వస్తున్నాడు.​
Tags:    

Similar News