సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ మాధురి దీక్షిత్ పేరు తెలియని వారు దాదాపుగా ఉండరు. 80..90 లలో భారీ విజయాలతో బాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన హీరోయిన్ మాధురి. హీరోలతో సమానమైన స్టార్ ఇమేజ్.. భారీ రెమ్యూనరేషన్ తో సంచలనం సృష్టించారు. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ లాంటి వారే మాధురి ఫ్యాన్స్ అంటేనే ఆమె రేంజ్ మనం అర్థం చేసుకోవచ్చు. పాత తరం హీరోయిన్ అయినప్పటికీ ఈవిడ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ అభిమానులతో టచ్ లో ఉంటారు.
తాజాగా మాధురి తన ఇన్స్టా ఖాతా ద్వారా కొత్త ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేసి "అసమ్ గా ఉండడాన్ని మర్చిపోవద్దు" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. నిజమే ఆమె ఎప్పుడూ అందంగా.. అద్భుతంగా ఉంటారు కాబట్టే అందరికీ అదే చెప్పారు. బ్లూ కలర్ డ్రెస్ లో దానికి తగ్గట్టు ఆభరణాలు ధరించి.. తనదైన శైలిలో ఒక బ్యూటిఫుల్ స్మైల్ ఇస్తూ ఫోటోలకు పోజిచ్చారు మాధురి. ఆ సింహాసనంలో కూర్చున్న స్టైల్ గ్రేస్ చూస్తే ఆమె ఎవర్ గ్రీన్ అనిపించకమానదు.
ఈ ఫోటోలకు నెటిజన్లు సూపర్ కామెంట్లు పెట్టారు. "యు ఆర్ ఆల్వేస్ ఆసమ్ మేమ్".. "ఎవర్ గ్రీన్ బ్యూటీ".. "ఏజ్ లెస్ బ్యూటీ".. "మీ గ్రేస్.. స్మైల్ ఎవరికీ రాదు" అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. సినిమాల విషయానికి వస్తే మాధురి 'కళంక్' చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. టీవీలో 'డ్యాన్స్ దీవానే' కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.