మాధురి చాలా వర్రీ అయిపోతోందే

Update: 2017-05-13 08:41 GMT
మాధురి దీక్షిత్ 90వ దశకంలో ఏ లిస్ట్ స్టార్. మాధురికి ఉన్న క్రేజ్ ఎంత ఉంది అంటే ఆమె ఫోటో పెట్టి పూజలు చేసే అభిమానాలు కూడా ఉన్నారు. కెరీర్ మంచి జోరు మీద ఉన్నపుడే పెళ్లి చేసుకొని ఎప్పటికీ నేను స్టార్ నే అని చెప్పింది. పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ యాష్ రాజ్ ఫిల్మ్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు రియాలిటీ షో తో డాన్స్ స్కూల్ తో బిజీ గా ఉన్న ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఒక ఆశక్తికర మాట చెప్పింది.

మాధురి అప్పట్లో సంజయ్ దత్ తో  డేటింగ్ చేసేదని ఒక రూమర్. 1993 బొంబాయి బాంబ్ బ్లాస్ట్ లో సంజయ్ ని అరెస్టు చేసినప్పటినుండి కొంచం దూరంగా ఉంటూ వచ్చింది. ఆ దూరం ఇప్పుడు పూర్తిగా పెరిగి “అతని గురించి నేను మర్చిపోయి చాలా కాలం అయ్యింది ఆయన గురించి నాకు ఏమి తెలియదు” అన్నంత వరుకు వెళ్లింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ టాపిక్ అనుకుంటున్నారా.. సంజయ్ దత్ జీవిత గాధను రణబీర్ కపూర్ హీరోగా రాజు హీరాని డైరెక్ట్ చేస్తూ సినిమా నిర్మిస్తున్నారు కదా..  అందులో మాధురి పాత్రను సోనమ్ కపూర్ చేస్తోంది. ఆ పాత్రకు నా పర్సనల్ సంబంధ విషయాలు ఏమి జోడించకండి అని రాజు హీరానితో పాటు సోనమ్ కూడా కలసి చెప్పుకొచ్చిందట.

అసలు నిజంగానే వీరి మధ్యన ఎటువంటి ఎఫైర్ లేకపోతే.. ఇప్పుడు ఇంత కంగారు పడటం ఎందుకు? నిజానికి ఆమె భర్త కూడా ఫిలిం ఇండస్ర్టీలో ఆమె మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఈ సమయంలో మాధురి ఎందుకు అంత వర్రీ అయిపోతోందో అర్ధంకావట్లేదు మరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News