80-90వ దశకంలో బాలీవుడ్ హిందీ సాంగ్స్ దేశాన్ని ఊపు ఊపేశాయి. అప్పట్లో బాలీవుడ్ సంగీత దర్శకుల నుంచి ఎన్నో ఆణిముత్యాలు లాంటి పాటలు జాలువారాయి. శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఆ కోవలోనే టాప్ హీరోయిన్ మాధురి దీక్షిత్ చేసిన ‘ఏక్ దో తీన్..చార్ పంచ్ సే’ అనే పాట దుమ్ముదులిపేసింది. ఇప్పటికీ ఏదైనా పార్టీ, పండుగల్లో ఆ పాట వేస్తారంటే అతిశయోక్తి కాదు.. ఈ సందర్భంగా ఆ మధురమైన పాట గురించి ‘మాధురీ దీక్షిత్’ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
అనిల్ కపూర్ హీరోగా.. మాధురీ దీక్షిత్ హీరోయిన్ గా ఎన్ చంద్ర దర్శకత్వంలో 1988లో విడుదలైన ‘తేజాబ్’ సినిమాలోని ‘ఏక్ దో తీన్’ పాటకు దేశం మొత్తం మార్మోగిపోయింది. ఈ పాటను మళ్లీ మళ్లీ ప్లే చేయమని థియేటర్స్ లో గోల చేశారంటే అర్థం చేసుకోవచ్చు.
మాధురీ దీక్షిత్ ఈ పాట గురించి చెబుతూ.. ‘ఏక్ దో తీన్ పాటను దాదాపు 1000మంది నిజమైన ప్రేక్షకుల మధ్య చిత్రీకరించినట్టు తెలిపింది. ఈ పాటకోసం 15 రోజుల ముందు నుంచే ప్రేక్షకుల మధ్య రిహార్సల్స్ చేశామని.. వారి మధ్యే షూట్ చేశామని తెలిపింది. భయపడకుండా ఇలా చేయడం మధురమైన అనుభూతి అన్నారు. ఈ పాట రిలీజ్ అయ్యాక అందరూ తనను మోహని అని పిలిచారని గర్వంగా తెలిపింది. దీనిపై మీ కామెంట్స్, ప్రశ్నలను ట్విట్టర్ లో అడగాలని మాధురి సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. కరోనా టైంలో మాధురి ఇలా తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.