బాలీవుడ్ లో ఇన్ సైడర్స్ వర్సెస్ ఔట్ సైడర్స్ వార్ .. నివురు గప్పిన నిప్పులా కొనసాగుతోందా? అంటే అవుననే గుసగుసలు ఉన్నాయి. బయటి ట్యాలెంట్ ని అణగదొక్కేందుకు ఎప్పుడూ ఇన్ సైడర్స్ కుట్రలు చేస్తుంటారని ముంబై మీడియాలో ఇప్పటికే చాలా కథనాలు వచ్చాయి. క్వీన్ కంగన రనౌత్ నేరుగా పబ్లిక్ వేదికలపైనే దీనిపై చెలరేగిన సందర్భాలు ఎన్నో. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఒక ఔట్ సైడర్. అతడిని ఎదగనీకుండా బాలీవుడ్ ఇన్ సైడర్ మాఫియా కుట్ర చేసిందన్న ప్రచారం ఉంది. అతడిలా పరిశ్రమకు వచ్చే ఇతరులకు ఇది తప్పదు.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఔట్ సైడర్ ట్యాలెంట్.. యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ పైనా ఇలాంటి కుట్ర సాగుతోందన్న గుసగుసలు ఒక సెక్షన్ లో వినిపిస్తున్నాయి. కార్తీక్ ఆర్యన్ అనూహ్యంగా తన పారితోషికం పెంచాడని 20కోట్ల లోపు తీసుకునే అతడు ఏకంగా 40కోట్లు డిమాండ్ చేస్తున్నాడని అనుకోని రీతిలో ఒక సెక్షన్ డిజిటల్ మీడియా ప్రచారం ప్రారంచింది. దీంతో ఇదంతా అతడిపై సాగుతున్న కుట్ర అంటూ అభిమానులు కొట్టి పారేస్తున్నారు. కరోనా తర్వాత కార్తీక్ నటించిన 'భూల్ భూలయ్యా 2' మొదటి అతిపెద్ద హిట్. కార్తీక్ ఆర్యన్ నటించిన ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్ లో చేరి ఇప్పటికే 120కోట్లు వసూలు చేసింది. కలెక్షన్ల పరంగా ఇది యువహీరో కెరీర్ లోనే అతిపెద్ద హిట్.
అయితే ఇంతలోనే ఊహించని ప్రచారం మొదలైంది. తాజా విజయంతో హీరో కార్తీక్ తన రెమ్యునరేషన్ ను అమాంతం రెట్టింపు చేసాడని ప్రముఖ బాలీవుడ్ వెబ్ సైట్ కథనం వెలువరించింది. ఇప్పటి వరకు కార్తీక్ రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు వసూలు చేస్తున్నాడని..తాజా విజయంతో రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడని ఈ కథనం పేర్కొంది.
సోషల్ మీడియాల్లో ఇది క్షణాల్లో వైరల్ అయ్యింది. అయితే ఈ వార్తలు నిరాధారం అంటూ కార్తీక్ డ్యామేజ్ కంట్రోల్ కి ప్రయత్నించాడు. అతడు మాట్లాడుతూ.. ''ప్రమోషన్ హువా హై లైఫ్ మే. ఇంక్రిమెంట్ నహీ (ఇప్పుడే జీవితంలో ప్రమోషన్ వచ్చింది.. ఇంక్రిమెంట్ కాదు). నిరాధారం'' అని కార్తీక్ ఆర్యన్ ట్వీట్ చేశాడు. తనపై వచ్చిన కథనాలను షేర్ చేసాడు.
నిజానికి దీనిని ఏ కోణంలో చూడాలి? ఇన్ సైడర్ మాఫియా వర్సెస్ ఔట్ సైడర్ ట్యాలెంట్ అన్న కోణంలోనే చూడాలా? కార్తీక్ ఔట్ సైడర్ కావడం వల్లనే అతడిపై ఈ దుష్ప్రచారమా? అన్న చర్చా ఇప్పుడు వేడెక్కిస్తోంది. ఒక సెక్షన్ డిజిటల్ మీడియా అతన్ని టార్గెట్ చేస్తోందన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. అయితే ఖండించాల్సిన వార్తలను అతడు తెలివిగా ఖండిస్తూ డ్యామేజ్ జరగకుండా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ 'అల వైకుంఠపురములో' రీమేక్ 'షెహజాదా'లో నటిస్తున్నాడు.
ఇక పరిశ్రమ మాఫియాలో భాగం అని భావించే ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఇంతకుముందు కార్తీక్ ని 'దోస్తానా2' మూవీ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. కార్తీక్ క్రమశిక్షణపైనా నిందలు వేస్తూ ఆ మూవీ నుంచి తొలగించారు. దోస్తానా 2 నుంచి వైదొలిగాక దానికి కౌంటర్ గా ఈ యంగ్ హీరో భూల్ భులయా 2తో బంపర్ హిట్ కొట్టాడు. ఔట్ సైడర్ ట్యాలెంటును ప్రజలు ఆదరిస్తారనడానికి ఇది ఒక ఉదాహరణగా నిలిచింది. ఇంతలోనే పారితోషికం పెంచాడన్న ప్రచారంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.