పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా సినిమా `వకీల్ సాబ్`. ఆదిత్య శ్రీరామ్ దర్శకుడు. దిల్ రాజు- బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే టైటిల్ లాంచ్.. పోస్టర్ లాంచ్ అంటూ ప్రమోషన్ లో స్పీడ్ పెంచిన టీమ్ .. మార్చి 8న జాతీయ మహిళా దినోత్సవం కానుకగా మహిళామణులకు ఒక స్పెషల్ గిఫ్ట్ ని రెడీ చేస్తున్నారు.
ఇంతకీ ఏమా గిఫ్ట్ అంటే.. సింగింగ్ సెన్సేషన్ సిధ్ శ్రీరామ్ ఆలపించిన మహిళా మోటివేషన్ పాటను రిలీజ్ చేయనున్నారు. తాజాగా సాంగ్ టీజర్ తో రుచి చూపించారు. ``మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా!`` అంటూ చిన్న పాటి గ్లింప్స్ ని వదిలారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్ అందించారు. సిధ్ శ్రీరామ్ ఆలపించిన ఈ ట్యూన్ ప్రస్తుతం ఫ్యాన్స్ లో వైరల్ అవుతోంది. మార్చి 8 జాతీయ మహిళా దినోత్సవం కానుక గా ఈ పాటను రిలీజ్ చేయనున్నారు.
ఇక అల వైకుంఠపురములో చిత్రంలో `సామ జవర గమనా..` అంటూ సిధ్ శ్రీరామ్ పాడిన పాట ఎలా దూసుకెళ్లిందో తెలిసిందే. అతడు ఏ సాంగ్ పాడినా అది రికార్డ్ బ్రేకింగే. యూత్ లో అతడికి అంత ఫాలోయింగ్ ఉంది. ఇక పూర్తి స్థాయి ట్యూన్ వింటే కానీ .. వకీల్ సాబ్ మగువా పాట రీచ్ ఎంతో చెప్పలేం. ట్యూన్ సింపుల్ గా ఉంది. స్ఫూర్తి నింపేదిగా ఉంటుందని అర్థమవుతోంది. ఇక అల వైకుంఠపురములో బుట్ట బొమ్మ తర్వాత రామజోగయ్యకు పవన్ కి రాసే ఛాన్స్ దక్కింది. మగువా పాటతో మరోసారి ఆయన పేరు మార్మోగుతుందేమో చూడాలి. వకీల్ సాబ్ ని సమ్మర్ లో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.
Full View