అమెరికా వీధుల్లో ఆహ నా పెళ్లి అంటా..

Update: 2018-05-11 19:59 GMT
టాలీవుడ్ కి ఈ ఏడాది నిజంగా చాలా స్పెషల్ అని చెప్పాలి. మొట్ట మొదటి సారి ఒక తెలుగు హీరోయిన్ జీవితం మహానటి ద్వారా చూసే అవకాశం దక్కింది. అన్ని వర్గాల ఏజ్ వాళ్లు సినిమాను ఆదరిస్తున్నారు అంటే సావిత్రి మహానటి అని ఎందుకు అంటారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అప్పట్లో కేవీ.రెడ్డి గారు మరో పది తరాలైన నిన్ను తెలుగు చిత్ర పరిశ్రమ గుర్తు పెట్టుకుంటుంది అని నిజంగా అన్నారో లేదో తెలియదు గాని సావిత్రి సినిమాలను చూస్తే ఆ మాట నిజమని అనకుండా ఉండలేము.

ఇకపోతే మహానటి సినిమాకు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో మన సంప్రదాయాలు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. మరి సంప్రదాయానికి అద్దం పట్టేలా ఉన్న సావిత్రి అక్కడ కనిపించారా?..అంటే అది అవివేకమే అవుతుంది. రీసెంట్ గా న్యూ యార్క్ లోని టైమ్ స్క్వైర్ వీధుల్లో సావిత్రి మాయాబజార్ లో చేసిన ఆహనా పెళ్లి అంటా అనే స్టెప్పులను కొంత మంది తెలుగు వెళ్లి వేసి చూపించారు. అందుకు సంబంధించిన వీడియో ను మహానటి టీమ్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది.

ఇక సినిమాకు ప్రమోషన్స్ ఏ మాత్రం అవసరం లేదు అనే విధంగా సినిమా నడుస్తోంది. రాజమౌళి - సుకుమార్ లాంటి వారు ఇప్పటికే ఎమోషనల్ గా సినిమా పై పాజిటివ్ కామెంట్స్ చేశారు. ఇక ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ భాగానే అందుతున్నాయి. వీకెండ్ కావడంతో ఇంకా పెరిగే అవకాశం ఉంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ కనిపించిన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని వైజయంతి వారు నిర్మించారు.
Tags:    

Similar News