ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ మహానటి సంచలన విజయాన్ని అందుకోవడంతో పాటూ స్వప్నాదత్ కుటుంబానికి కాసుల వర్షం కురిపిస్తోంది. ఎప్పటినుంచో సావిత్రి జీవితం గురించి ఎంతో మందికి తెలుసు. అయినా ఎవరూ ఇంతవరకు సినిమాగా మలిచే ప్రయత్నం చేయలేదు. అదే నాగ అశ్విన్‌కు కలిసొచ్చిన అంశం. ఇంతకు మునుపే ఎవరైనా సావిత్రి కథను టచ్ చేసి ఉంటే ఈ స్థాయిలో విజయం వచ్చిండేదో లేదో. ఏది ఏమైనా ఆయన దర్శకత్వ ప్రతిభతో సావిత్రి జీవితం వెండితెరపై వెలిగిపోయింది. ఆ సినిమాను నిర్మించిన స్వప్నా సినిమాస్ కు కాసుల పంట పండిస్తోంది.
స్వప్నా సినిమాస్ ఎవరిదో కాదు అశ్వనీదత్ పెద్ద కూతురు స్థాపించిన సంస్థే. ఇది కూడా వైజయంతీ బ్యానర్ కిందకే వస్తుంది. కాగా మహానటి విడుదలయ్యాక థియేటర్లు ఇప్పటికీ కిటకిటలాడుతూనే ఉన్నాయ్. తాజాగా ఆ సినిమా తెలుగు తమిళ శాటిలైట్ డిజిటల్ హక్కులను కూడా అమ్మేశారు. దాదాపు 18 కోట్ల రూపాయలకు అమ్మేసినట్టు సమాచారం. అంటే ఇప్పటికే సినిమాకు పెట్టిన ఖర్చంతా వెనక్కి వచ్చేసినట్టే. ఇక థియేటర్ల ద్వారా వచ్చేదంతా లాభం కిందకే వెళుతుంది. అంతేనా ఆన్ లైన్ స్ట్రీమింగ్ కంపెనీలు కూడా మహానటి కోసం పోటీ పడుతున్నాయి. అమెజాన్ ... నెట్ ఫ్లిక్స్ సంస్థలు ఇప్పటికే చర్చలు మొదలుపెట్టాయి. ఈ రెండూ కూడా భారీగానే ముట్టచెప్పగల సత్తా ఉన్నసంస్థలే. కనుక ఆ మొత్తం కూడా స్వప్నా సినిమాస్ కు భారీ లాభాన్ని తెచ్చిపెడుతుంది. దీనిని బట్టి చూస్తే బడ్జెట్ రెండు మూడు రెట్లు ఎక్కువే వచ్చే పరిస్థితి ఉంది.
మహానటి ప్రస్తుతం అమెరికాలో కూడా బాగా ఆడుతోంది. నైజాం ఏరియాలో కూడా కలెక్షన్లు బాగానే ఉన్నాయి. చాలా ఏళ్ల గ్యాప్ తరువాత వైజయంతీ మూవీస్ సంస్థకి భారీ లాభం కలిసివచ్చింది. ఇదంతా నాట అశ్విన్ గొప్పతనమే అని చెప్పాలి. సావిత్రి సినిమాను చాలా ప్రతిష్థాత్మకంగా తీసుకుని చిత్రీకరించారాయన. ఆయన కష్టానికి ఫలితం ఇప్పుడు వరదలా పారుతోంది. ఇక తరువాత వచ్చే ఆయన సినిమాలపై అంచనాలు పెరిగిపోవడం సహజమే.