సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ‘మహానటి’ చిత్రాన్ని ‘నడిగర్ తిలకం’ పేరుతో ఒకేసారి తమిళంలోనూ తెలిసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రం రెండు బాషల్లో ఒకేసారి విడుదల కావట్లేదు. తెలుగు వెర్షన్ ఈ బుధవారమే ప్రేక్షకుల ముందుకు వస్తుండగా.. తమిళ వెర్షన్ రెండు రోజులు ఆలస్యంగా శుక్రవారం విడుదల కాబోతోంది. మామూలుగా కొత్త సినిమాలు శుక్రవారమే విడుదలవుతాయి. ఐతే మే వైజయంతీ మూవీస్ ప్రస్థానంలో ప్రత్యేకంగా నిలిచిపోయిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ మే 9న విడుదలైన నేపథ్యంలో సెంటిమెంటుగా భావించి తెలుగు వెర్షన్ ను ఈ బుధవారమే విడుదల చేస్తున్నారు.
తమిళ వెర్షన్ మాత్రం యధావిధిగా శుక్రవారం రాబోతోంది.నెలన్నర సమ్మె కారణంగా తమిళ బాక్సాఫీస్ స్లంప్ లో పడింది. ఆ తర్వాత కూడా సరైన సినిమా పడక బాక్సాఫీస్ వెలవెలబోతోంది. ఇలాంటి తరుణంలో ఈ వారాంతంలో అక్కడ సినీ ప్రియులకు ఆశావహ వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు ‘నడిగర్ తిలగం’.. మరోవైపు ‘ఇరుంబుతురై’ (తెలుగులో అభిమన్యుడు) మంచి అంచనాల మధ్య రిలీజవుతున్నాయి. వీటి మధ్య రసవత్తర పోరు ఉంటుందని ఆశిస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లోనూ సమంత కీలక పాత్ర పోషించడం విశేషం. సావిత్రి తమిళ సినిమాల్లోనూ పేరున్న నటే కావడం.. తమిళులకు కనెక్టయ్యే చాలా పాత్రలు.. నటీనటులు ఈ సినిమాలో ఉండటంతో అక్కడి ప్రేక్షకుల్లో ఆసక్తి రేగుతోంది. మరి అక్కడ ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.