సితార డ్యాన్స్.. మహేష్ షాక్

Update: 2016-05-23 10:37 GMT
మహేష్ బాబు తన కుటుంబానికి ఎంత ప్రాధాన్యమిస్తాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ యంగ్ హీరోల్లో బెస్ట్ ఫ్యామిలీ మ్యాన్ ఎవరంటే అతడి పేరే చెప్పాలి. ముఖ్యంగా తన పిల్లలతో గడపడాన్ని బాగా ఆస్వాదిస్తాడు మహేష్. గౌతమ్.. సితార ఇద్దరూ కూడా అతడి బెస్ట్ ఫ్రెండ్స్. ఇంతకుముందు గౌతమ్ తో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడినని... ఇప్పుడు సితారతో ఎక్కువగా ఆడుకుంటున్నానని అంటుంటాడు మహేష్. ఏ ఇంటర్వ్యూల్లో అతణ్ని కదిపినా సితార ముచ్చట్లు చెబుతుంటాడు. తాజాగా జీ తెలుగుతో ‘కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను’ షోకు వచ్చిన మహేష్ సితార గురించి చాలా చెప్పాడు.

ఆ సందర్భంగా మహేష్ సినిమా ‘శ్రీమంతుడు’లోని రాములోడు వచ్చినాడురో పాటకు సితార డ్యాన్స్ చేస్తున్న వీడియోను ప్లే చేశారు. ఇది మహేష్ కు తెలియకుండా తీసిన వీడియో కావడం విశేషం. ఇది అలా ప్లే అవడం ఆలస్యం.. మహేష్ షాకైనట్లు ఎక్స్ ప్రెషన్ పెట్టాడు. ఇదెప్పుడు తీశారండీ.. మీకెలా దొరికిందంటూ నవ్వుతూ అడిగాడు. తన కూతురు నడుం తిప్పుడూ స్టెప్పులేసినపుడైనా మహేష్ తెగ సిగ్గు పడిపోయాడు. ఇక సితార గురించి చెబుతూ.. ‘‘తనొక అమేజింగ్ కిడ్. ఎప్పుడూ చూసినా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. బ్రహ్మోత్సవం సెట్లోకి వచ్చి.. సమంతతో కూడా చాలా ముచ్చట్లు చెప్పింది. మీ అమ్మాయిని తీసుకురా ఆడుకుందాం అని సమంతకు చెప్పింది. మొన్న ‘బ్రహ్మోత్సవం’ ఆడియో వేడుకకు తీసుకొచ్చే ముందు కొంచెం భయపడ్డా. తన భయపడుతుందేమో అని. కానీ సితార మాత్రం అక్కడ కూడా ఇంట్లో ఉన్నట్లే కనిపించింది. ఆ హడావుడి ఏం పట్టించుకోకుండా తన లోకంలో తనుండిపోయింది. అందరితో ముచ్చట్లు చెప్పింది’’ అని మహేష్ అన్నాడు.
Full View

Tags:    

Similar News