సూపర్ స్టార్ మహేష్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడుకి యునానిమస్ గా హిట్ టాక్ వచ్చింది. ఈ సినిమా గురించి సమీక్షకులంతా పాజిటివ్ గా స్పందించారు. బైట థియేటర్ల నుంచి రిపోర్ట్ బావుంది. మహేష్ క్రేజు తో ఈ మూడు రోజులు ఆడినా, ఇప్పటికే హిట్ టాక్ వచ్చింది కాబట్టి ఇక రెండు వారాలు మినిమంగా ఆడేయడం ఖాయం. అయితే ఈ సినిమాలో ఒక్కో హైలైట్ గురించి సర్వత్రా చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ అదిరిపోయిందన్న టాక్ నడుస్తోంది.
మహేష్ ఫైట్స్ అన్నీ చాలా స్టయిలిష్ గా చేశాడు. అనల్ అరసు ఫైట్ కంపోజింగ్ అదరిపోయింది. ఎక్కడ ఎవరికి ఎలా దరువెట్టాలో అలా పెట్టించాడు. ఫైట్స్ అన్నీ సరైన టైమింగ్ తో సరైన ప్లానింగ్ తో ఏర్చి కూర్చి పెట్టారు. అవతలి వాడితో ఘర్షణ పడడం, పక్కకి పిలిచి ఉతికేయడం హైలైట్ అయ్యింది. ఒక రాజకీయనాయకుడిని కెలికి అటుపై కిక్కిచ్చే ఫైట్స్ చేస్తే ఎలా ఉంటుందో చూపించారు. ముఖ్యంగా చారుశీల ఫ్రెండు పెళ్లి పార్టీకి వెళ్లి అక్కడ రౌడీల్ని సైలెంటుగా మడతెట్టేస్తాడు ప్రిన్స్. ఆ ఫైట్ కి థియేటర్ల లో రెస్పాన్స్ బావుంది. పాత చింతకాయే అయినా కొత్తగా రుచి చూపించాడు అనల్ అరసు.
అలాగే క్లయిమాక్స్ ఫైట్, ఛేజింగులు చేసుకొచ్చి చావుదెబ్బలు తినే రౌడీలతో ఫైట్.. అన్నీ కిక్కో కిక్కు. మహేష్ కొద్ది పాటి కండలు పెంచి, షేపులు తీర్చిదిద్ది, స్లిమ్ముగా కనిపిస్తూనే కొట్టేయగలడు అనిపించేశాడు. సూపర్ శ్రీమంతుడు గురూ!