మహేష్ అక్కడ ముగించేశాడు!!

Update: 2016-12-23 09:30 GMT
మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ.. ప్రస్తుతం అహ్మదాబాద్ లో సుదీర్ఘమైన షెడ్యూల్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇవాల్టితో గుజరాత్ షూటింగ్ ఫినిష్ చేసుకోనున్న మహేష్ అండ్ టీం.. తిరిగి హైద్రాబాద్ వచ్చేయనుంది. దాదాపు నాలుగు వారాలపాటు అహ్మదాబాద్ లో షూటింగ్ చేయగా.. ఇక్కడ పలు యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కించారు.

హీరోతో పాటు మెయిన్ విలన్ ఎస్ జే సూర్య.. మరో విలన్ భరత్  లతో కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. అహ్మదాబాద్ షెడ్యూల్ పూర్తి కాగానే దాదాపు రెండు వారాల పాటు బ్రేక్ తీసుకోనుంది మూవీ యూనిట్. ఈ బ్రేక్ లో మహేష్ బాబు యూకే టూర్ ప్లాన్ చేసుకున్నాడు. ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్.. న్యూ ఇయర్ లను ఇంగ్లండ్ తో పాటు పలు దేశాల్లో జరుపుకోనున్నాడు. ఆ తర్వాత మళ్లీ  కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుందని.. ఆ షెడ్యూల్ తో మూవీ షూటింగ్ చాలాభాగం కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది.

 ప్రస్తుతం ఈ మూవీపై చాలా టైటిల్స్ వార్తల్లో చక్కర్లు కొడుతున్నా.. యూనిట్ ఇంకా అసలు టైటిల్ ను వెల్లడించలేదు. జనవరి 1న ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి.. మహేష్-మురుగ మూవీకి టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News