మహేష్ కి గట్టి దెబ్బ తగలనుందా?

Update: 2017-02-03 05:42 GMT
మహేష్ బాబు కోలీవుడ్ లో అరంగేట్రానికి మంచి ప్లాన్స్ నే వేసుకున్నాడు. క్రేజీ మురుగదాస్ డైరెక్షన్ లో బై లింగ్యువల్ మూవీ చేయడం.. మాస్ ఎలిమెంట్స్ ని పక్కాగా జొప్పించే దర్శకుడు కావడంతో.. మహేష్ కి తమిళనాట కూడా మార్కెట్ క్రియేట్ అయ్యే అవకాశాలున్నాయని ఎక్స్ పెక్ట్ చేశారు. రిలీజ్ డేట్ విషయంలో కూడా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు.

మొదటగా సమ్మర్ కి వద్దామని అనుకున్నా.. తమిళ్ న్యూ ఇయర్.. బాహుబలి.. సమ్మర్ కి కోలీవుడ్ రిలీజెస్ ఇవన్నీ లెక్కలేసుకుని.. చివరకు జూన్ 23ను రిలీజ్ డేట్ గా సెట్ చేసుకున్నాడు మహేష్. సంభవామి టైటిల్ పరిశీలిస్తుండగా. ఈ చిత్రంతో కోలీవుడ్ లో పాగా వేసేయాలన్నది సూపర్ స్టార్ టార్గెట్. అయితే.. మహేష్-మురుగ ఆలోచనలకు అప్పుడే ఓ ఎదురుదెబ్బ తగిలేసింది. ఈద్ సందర్భంగా ఆ వీకెండ్ కి మహేష్ ఫిక్స్ అయితే.. ఇప్పుడు అదే రోజుకు కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ నటించిన వివేగం రిలీజ్ కానుందనే అనౌన్స్ మెంట్ వచ్చింది.

అజిత్ సినిమా వచ్చిన రోజున.. అంతగా మార్కెట్ లేని మహేష్ మూవీ రిలీజ్ చేయడం సాహసమే అవుతుంది. అసలు కోలీవుడ్ జనాలు పట్టించుకునే పరిస్థితి కూడా ఉండదు. దీంతో జూన్ 23 డేట్ పై సందిగ్ధంలో పడిందట మహేష్ అండ్ టీం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News