కాలా కోసం మహేష్ అండ్ బన్నీ ప్లాన్

Update: 2018-02-12 14:30 GMT

స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ యుద్దానికి దిగితే ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. ఓకే సినిమా ప్రభావం మరో సినిమాపై పడచ్చు పడకపోవచ్చు. ఫైనల్ గా ఏ సినిమా అయినా బావుంటే చూస్తారు. లేదంటే లేదు అనే టాక్ ఎప్పటి నుండో వస్తుంది. కాని అది ఎంతవరకు నిజం అనేది కొన్ని పరిస్థితుల్లో చెప్పలేము. ఎందుకంటే ఫ్యాన్స్ మధ్య ఈగోలు ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో రెండు సినిమాల్లో ఏ ఒక్క సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిన తేడా వచ్చేస్తోంది.

అయితే ఈ సమ్మర్ లో ఎలాంటి పరిస్థితుల్లోల్ అయినా సినిమాను రిలీజ్ చేయాలనీ అల్లు అర్జున్ - మహేష్ డిసైడ్ అయ్యారు. నా పేరు సూర్య - భరత్ అనే నేను ఏప్రిల్ 27న రావాలని ఫిక్స్ అయ్యాయి. రెండు సినిమాలకు సమానంగా థియేటర్స్ దక్కే అవకాశం ఉంది. అయితే మధ్యలో కోలీవుడ్ హీరో రజినీకాంత్ సినిమా వచ్చి కూర్చుంది. 2.0 అనుకుంటే ఊహించని విధంగా కాలా వచ్చింది. నిర్మాత ధనుష్ కి ఇక్కడ పరిచయాలు బాగానే ఉన్నాయి. దీంతో భారీగా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు.  

అయితే బన్నీ సైడ్ అల్లు అరవింద్.  మహేష్ సైడ్ దిల్ రాజు ఉన్నారు. వీరి నిర్ణయం వల్ల థియేటర్స్ మరొకరికి వెళ్లవు అనేది ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో వస్తోన్న టాక్. భరత్ అనే నేను సినిమాను నిర్మిస్తోంది డివివి.దానయ్య అయినప్పటికీ డిస్ట్రిబ్యూట్ చేయబోయేది దిల్ రాజే. బన్నీ సైడ్ ఎలాగో వారి తండ్రి ఉన్నారు. దీంతో మహేష్ - బన్నీ థియేటర్స్ విషయంలో పక్కాగా ఓ ప్లాన్ వేసుకున్నారని తెలుస్తోంది.  
Tags:    

Similar News