మ‌హేష్‌- గౌత‌మ్ బ్యాక్ టు వ‌ర్క్

Update: 2019-10-12 04:36 GMT
సినిమాలతో పాటు ఫ్యామిలీకి కొంత మంది స్టార్స్ ప్రాధాన్య‌త‌నిస్తుంటారు. అలాంటి స్టార్స్ లో మ‌హేష్  ముందు వ‌రుస‌లో వుంటార‌ని చెప్పాలి. వ‌రుస షూటింగ్ ల‌తో పిల్ల‌ల‌కు.. ఫ్యామిలీకి దూరంగా గ‌డిపే ప్రిన్స్ మ‌హేష్ త‌ను అంగీక‌రించిన సినిమా పూర్తి కాగానే ఫ్యామిలీతో క‌లిసి రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోతుంటారు. ఏదైనా జాలీ ట్రిప్ ప్లాన్ చేసి ఫ్యామిలీ స‌మేతంగా ఫారిన్ చెక్కేస్తుంటారు. అక్క‌డ పిల్ల‌లతో.. ఫ్యామిలీతో జాలీగా ఎంజాయ్ చేస్తుంటారు. ప్ర‌తి యేడాది క్ర‌మం త‌ప్ప‌కుండా పిల్ల‌ల హాలీడేస్ ని జాలీగా ఎంజాయ్ చేసే మ‌హేష్ ఈ ద‌స‌రా సీజ‌న్ ని కూడా పిల్ల‌ల‌తో క‌లిసి హ్య‌పీగా గ‌డ‌పాల‌ని ప్లాన్ చేసుకున్నాడు.

ఫ్యామిలీతో క‌లిసి స్విట్జ‌ర్లాండ్ వెళ్లిపోయాడు. ఈ ట్రిప్ కి సంబంధించిన ఫొటోల్ని సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో అభిమానుల‌తో మ‌హేష్‌.. న‌మ్ర‌త పంచుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. స్విట్జర్లాండ్ లోని అందాల మ‌ధ్య ఫ్యామిలీ స‌మేతంగా విహ‌రిస్తున్న మ‌హేష్ త‌న‌కు ఈ భూమిపై అత్యంత ఇష్ట‌మైన ప్లేస్ ఏంటో చెప్పేసి ఫ్యాన్స్ ని స‌ర్ ప్రైజ్ చేశాడు. స్విస్ అలాప్స్ త‌న‌కు అత్యంత ఇష్ట‌మైన ప్లేస్ అని అక్క‌డే ఈ ద‌స‌రా వేడుక‌ల్ని ఎంజాయ్ చేస్తున్నాన‌ని మ‌హేష్ పోస్ట్ చేసిన ఫొటో ఆక‌ట్టుకుంటోంది. ఇదే కాకుండా త‌న పిల్ల‌ల‌తో క‌లిసి డిన్న‌ర్‌.. సితార‌ - గౌత‌మ్‌ ల ఫొటోలు ఇన్ స్టాను ముంచేస్తున్నాయి. ఈ ట్రిప్ ని మ‌హేష్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసిన‌ట్టుగా అర్థ‌మ‌వుతోంది. తాజాగా ఈ జాలీ ట్రిప్ నుంచి చివ‌రి ఫోటోల్ని రివీల్ చేశారు న‌మ్ర‌త శిరోద్క‌ర్. వీటిలో మ‌హేష్ తో పాటు గౌత‌మ్ రిట‌ర్న్ జ‌ర్నీలో ఉన్న ఫోటోని షేర్ చేశారు. అలాగే సితార ప్ర‌కృతి సౌంద‌ర్యాన్ని ఆరాధిస్తున్న ఫోటోని.. న‌మ్ర‌త‌కు సంబంధించిన ఫోటోల్ని షేర్ చేశారు. ఇవ‌న్నీ అభిమానుల్లోకి దూసుకుపోతున్నాయి. ``బ్యాక్ టు వ‌ర్క్ అండ్ స్కూల్!`` అంటూ మ‌హేష్ తాను షేర్ చేసిన ఫోటోకి క్యాప్ష‌న్ ఇచ్చారు. అంటే మ‌హేష్ ట్రిప్ ముగించుకుని తిరిగి ప‌నిలో జాయిన్ అవుతున్నార‌ని అర్థ‌మైంది. గౌత‌మ్ - సితార య‌థావిధిగా స్కూల్ కి వెళ‌తారు.

మ‌హేష్ ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంలో న‌టిస్తున్నాడు. అనిల్ సుంక‌ర‌తో క‌లిసి దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. విజ‌యశాంతి రీ ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలే వున్నాయి.

   

Tags:    

Similar News