లండన్ లో మహేష్‌ 10 రోజులే

Update: 2017-04-16 05:27 GMT
ఇప్పుడు తదుపరి రాబోయే సినిమా మొత్తం లండన్ లోనే షూటింగ్ చేస్తున్నారు అనగానే మహేష్‌ బాబు అభిమానులు కాస్త షాక్ తిన్నారు. ఎందుకంటే 1-నేనొక్కడిన సినిమా కోసం సుకుమార్ కూడా ఇలాగే లండన్ మరియు పరిసర నగరాల్లో ఏకంగా 40 రోజులపాటు షూటింగ్ చేశాడు. ఆ రిజల్టు ఏమైందో తెలిసిందే. అయితే కొరటాల శివ సినిమాలో లండన్ షెడ్యూల్ అంత పెద్దదికాదయా.

నిజానికి ''భరత్ అను నేను'' అంటూ రూపొందుతున్న సినిమాలో విదేశాల్లో తీసే భాగం తక్కువేనట. కాకపోతే ఇక్కడ సమ్మర్ హీరో ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. మే నెలాఖర్లో లండన్ వెళ్ళి ఓ 10 రోజులు షూటింగ్ చేసుకుని రావాలని అనుకుంటున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఆ 10 రోజుల షూట్ తరువాత మొత్తం హైదరాబాదులోనే సినిమా అంతా రూపొందిస్తారని తెలుస్తోంది. సో ఈసారి లండన్ వర్క్ బాగా తక్కువేననమాట.

ఇకపోతే ఈ సినిమా కోసం కియారా అద్వాని పేరుతో పాటు దిశా పటానీ పేరు కూడా వినిపిస్తోంది. కాని ఇంతవరకు ఎవ్వరినీ ఫైనల్ చేయలదని అంటున్నారు కొరటాల సన్నిహితులు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News