మహేష్ జనవరికే ముగించేస్తాడటగా!

Update: 2016-09-13 05:18 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు- క్రేజీ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ ని హైద్రాబాద్ లో పూర్తి చేసుకున్న మహేష్ అండ్ టీం.. ప్రస్తుతం చెన్నైలో రెండో షెడ్యూల్ కూడా చేసేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం.. పక్కా ప్లానింగ్ తో షూటింగ్ జరుపుకుంటోంది.

సూపర్ స్టార్ సినిమా గురించి వచ్చిన ఓ సూపర్ అప్ డేట్ ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. దర్శకుడు మురుగదాస్.. మహేష్ మూవీకి ఎంత పక్కాగా ప్లానింగ్ చేసుకున్నాడంటే.. జనవరి నెలాఖరు నాటికే షూటింగ్ మొత్తం పూర్తయిపోతుందట. ఇందులోనే టాకీ పార్ట్.. పాటలు కూడా కంప్లీట్ చేసేస్తారట. అందుకే సమ్మర్ లో కచ్చితంగా రిలీజ్ చేస్తామని ఒకటికి నాలుగు సార్లు చెబుతోందట మురుగ అండ్ కో. అయితే.. జనవరిలో షూటింగ్ పూర్తయిపోతే.. సమ్మర్ వరకూ రిలీజ్ ఎందుకు పెండింగ్ పెట్టడం అనే డౌట్ సహజం.

ఈ యాక్షన్ థ్రిల్లర్ లో.. విజువల్ ఎఫెక్ట్స్ అవసరం చాలా ఉంటుందని తెలుస్తోంది. వీటిని పూర్తి చేసేందుకు 3 నెలల టైమ్ కేటాయించాడట మురుగదాస్. ఆ లెక్కన ప్రమోషన్స్ కు కూడా బోలెడంత టైమ్ దొరుకుతుంది. మొత్తంమీద ఏప్రిల్- మే నెలల్లో మహేష్ మూవీ థియేటర్లలోకి రావడం అయితే పైనల్.
Tags:    

Similar News