మ‌హేష్ వాణిజ్య‌ ప్ర‌క‌ట‌న‌.. క్యూరియాసిటీ ఏదీ?

Update: 2021-04-03 04:30 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఓవైపు సినిమాల‌తో బిజీగా ఉన్నా.. మ‌రోవైపు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లోనూ న‌టిస్తూ ఆర్జిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏడాదికి అర‌డ‌జ‌ను పైగానే ప్ర‌ఖ్యాత బ్రాండ్ల‌కు మ‌హేష్ ప్ర‌మోష‌న్ చేస్తున్నారు.

తాజాగా మ‌హేష్ న‌టించిన ప్ర‌ఖ్యాత‌ లాయిడ్ ఏసీ ప్ర‌క‌ట‌న టీవీల్లో ఎయిర్ అవుతోంది. కానీ ఈ ప్ర‌క‌ట‌న ఏమంత క్రియేటివిటీ లేక తేలిపోయింద‌ని అభిమానుల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా ఈ ప్ర‌క‌ట‌న‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే ఇది య‌థావిధిగా మ‌రో రెగ్యుల‌ర్ ప్ర‌క‌ట‌న‌లా సోసోగానే ఉంద‌నేది అభిమానుల వాద‌న‌.

సినిమాల ప‌రంగా అంత పెద్ద క్రియేటివిటీని చూపించే ద‌ర్శ‌కులు ఇంత చిన్న యాడ్ విష‌యంలో రొటీన్ గానే ఆలోచిస్తారా? అన్న సందేహం అయితే క‌లిగింది. అయితే త‌మ‌కు ఉన్న త‌క్కువ స‌మ‌యంలో దానిని క్రియేట్ చేయాలి.. పైగా కొన్ని సెక‌న్ల నిడివిలోనే బోలెడంత క్రియేటివిటీని ప్ర‌ద‌ర్శించాల్సి ఉంటుంది. అందుకే సినిమాతో పోలిస్తే ప్ర‌క‌ట‌న‌ల రూప‌క‌ల్ప‌న ఈజీ కాద‌నే వాద‌నా ఉంది. మ‌రి తాజా ప్ర‌క‌ట‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై సందీప్ కానీ.. మ‌హేష్ కానీ స్పందించే వీలుందేమో చూడాలి.

అన్న‌ట్టు ర‌ణ‌బీర్ క‌పూర్ హీరోగా సందీప్ వంగా యానిమ‌ల్ అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఆ త‌ర్వాత మ‌హేష్ తో సినిమాని ఖాయం చేసుకుంటాడా? అన్న‌ది వేచి చూడాలి. మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట‌ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.
Full View
Tags:    

Similar News