మహేష్ బాబు కొత్త సినిమా ‘భరత్ అను నేను’ను ముందు సంక్రాంతికే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. ఏప్రిల్ కు వాయిదా వేశారు. కానీ ఇప్పుడేమో ఏప్రిల్లో కూడా సినిమా రాదని.. జూన్ కు వాయిదా అని రెండు రోజుల నుంచి గట్టి ప్రచారం జరిగింది. దీంతో చిత్ర బృందం వెంటనే అప్రమత్తమైంది. ‘భరత్ అను నేను’ పక్కాగా ఏప్రిల్లోనే రిలీజవుతుందని.. వాయిదా వేసే సమస్యే లేదని స్పష్టం చేసింది.
దీంతో ఏప్రిల్లో రసవత్తర సమరం ఖాయమని తేలిపోయింది. ఇప్పటికే ‘నా పేరు సూర్య’ ఏప్రిల్ రిలీజ్ పక్కా అని చిత్ర బృందం ప్రకటించింది. మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘2.0’ ఏప్రిల్ 14న రిలీజ్ అంటూ స్వయంగా రజినీకాంతే ప్రకటించాడు. మార్చి 30న ‘రంగస్థలం’ రాబోతోంది. రిలీజ్ మార్చిలో అయినా.. ఆ సినిమా సందడి కొనసాగేది ఏప్రిల్లోనే. ఇలా ఒకే నెలలో నాలుగు భారీ సినిమాల్ని ఎలా థియేటర్లలో అకామొడేట్ చేస్తారు.. డేట్లు ఎలా సర్దుబాటు చేసుకుంటారన్నది ఆసక్తికరం. ముందు డేట్ ఇచ్చారు కాబట్టి ‘నా పేరు సూర్య’ సినిమాకు ఏప్రిల్ 27వ తేదీని ఇచ్చేయాలి. ‘రంగస్థలం’ తర్వాత.. ‘2.0’కు ముందు వచ్చే ఒక వీకెండ్లో ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశాల్లేవు. అలాగే ‘2.0’ తర్వాత.. ‘నా పేరు సూర్య’కు ముందు మధ్యలో వచ్చే వారాంతంలోనూ ఈ సినిమాను రిలీజ్ చేయడం కష్టం మరి ఏం చేస్తారో చూడాలి.
‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘భరత్ అను నేను’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ‘శ్రీమంతుడు’కు ముందు.. తర్వాత మహేష్ నటించిన నాలుగు సినిమాలూ డిజాస్టర్లే. ముఖ్యంగా గత రెండేళ్లలో ‘బ్రహ్మోత్సవం’.. ‘స్పైడర్’ రూపంలో దారుణమైన ఫలితాలనందుకున్నాడు మహేష్. దీంతో ‘భరత్ అను నేను’తో అతను హిట్టు కొట్టడం చాలా కీలకం. మరి ఇలాంటి సినిమాను అంత పోటీ మధ్య రేసులో నిలబెట్టడం కరెక్టేనా అన్నది సందేహం.