స్టార్ హీరోలు కమర్షియల్ సినిమాలతో పాటు సోషల్ ఎలిమెంట్స్ ఉన్న కథలను తెరకెక్కిస్తే సినిమాలు ఒక్కోసారి మంచి హిట్ అవుతాయి. అంతే కాకుండా హీరోల రేంజ్ కూడా బాగా పెరుగుతుంది. ఇది అందరికి తెలిసిన ఫార్ములానే కానీ ఒక్కోసారి సోషల్ ఎలిమెంట్ డోస్ ఏ మాత్రం ఎక్కువైనా రిజల్ట్ ఊహించని విధంగా ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ సారి భరత్ అనే నేను సినిమా మొత్తం సోషల్ ఎలిమెంట్ తోనే ఉంటుందట.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపిస్తోన్న సంగతి అందరికి తెలిసిందే. పూర్తిగా రాజకీయ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో స్ట్రాంగ్ సోషల్ ఎలిమెంట్ ఒకటి సినిమా స్థాయిని పెంచేస్తుందట. రీసెంట్ గా చిత్ర యూనిట్ నుంచి అందిన సమాచారం ప్రకారం సినిమాలో ప్రస్తుతం నెలకొన్న సమస్యల ప్రస్తావన ఉంటుందట. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ సిస్టమ్ మీద స్ట్రాంగ్ పాయింట్ ఉంటుందని తెలుస్తోంది. ఆ ఎపిసోడ్ కి సంబందించిన సీన్స్ సినిమాకి ప్రధాన బలమని చెబుతున్నారు.
కొరటాల తన వ్యక్తిగత జీవితంలో కూడా ఇలాంటి విషయాల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తుంటాడు. ఇక శ్రీమంతుడు - జనతా గ్యారేజ్ సినిమాల్లో కూడా సామజిక అంశంతో కూడిన సన్నివేశాలను చూపించాడు. అయితే ఇప్పుడు పూర్తిగా కొరటాల సోషల్ ఎలిమెంట్స్ తో కూడుకున్న సన్నివేశాలనే ఎక్కువగా హైలెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ కాన్సెప్ట్ ఆడియెన్స్ కు ఎంత వరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.