బాలీవుడ్ లో భరత్ పక్కా

Update: 2018-04-23 04:34 GMT
టాలీవుడ్ లో ఒకప్పుడు సందేశాత్మక చిత్రాలు తెరకెక్కిస్తే ఎక్కువగా విజయాలు అందేవి కావని ఒక టాక్ ఉండేది. ముఖ్యంగా కొందరు స్టార్ దర్శకులైతే.. ఆ లైన్ ఎంచుకున్నారంటే వారు ఫెయిల్ అయినట్టే అని కూడా చెప్పారు. కానీ మెస్సేజ్ అందించే చిత్రాల్లో కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడిస్తే తప్పకుండా నచ్చుతుందని కొందరు దర్శకులు నిరూపించారు. ముఖ్యంగా మన తెలుగులో ప్రస్తుతం కొరటాల శివ అదే తరహాలో కథలు రాసుకుంటున్నాడు.

రీసెంట్ గా వచ్చిన భరత్ అనే నేను ఏ స్థాయిలో ప్రశంసలు అందుకుంటుందో అందరికి తెలిసిందే. ఒక నాయకుడు ఎలా ఉండాలి. ఇచ్చిన వాగ్దానాలను హామీలను ఎలా నెరవేర్చుకోవాలనే పాయింట్ ని కరెక్ట్ గా ప్రజెంట్ చేశాడు. అంతే కాకుండా పాలిటిక్స్ లోని వివిధ అంశాలను అందరికి అర్థమయ్యేలా చాలా సున్నితంగా చూపించాడు. అయితే ఇలాంటి సినిమా ఇప్పుడు పరబాషకు కూడా వెళితే మంచి టాక్ ను అందుకుంటుందని చెప్పవచ్చు. ఒక సామాజిక అంశం కావడంతో ఇలాంటి కథలకు భాషాబేధం ఉండదు.

అందుకే భరత్ అనే నేను సినిమాను ఇతర భాషల్లో డబ్ చేయాలని చూస్తున్నారు. బాలీవుడ్ - హిందీలో కూడా అనువదించదానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు దర్శకుడు కొరటాల శివ స్పెషల్ గా తెలియజేశారు. ఇక సీక్వెల్ కి సంబంధించిన రూమర్స్ గురించి మాట్లాడుతూ.. ఎంటర్టైన్ చేయడానికి సీక్వెల్స్ ముఖ్యం కాదు. ఫ్రెష్ కథలు చాలా ఉన్నాయని కొరటాల వివరించారు. ఇక భరత్ అనే నేను ఇప్పటికే 70 కోట్ల వరకు షేర్స్ ను అందించి మహేష్ కెరీర్ లో ది బెస్ట్ చిత్రంగా నిలిచింది.
Tags:    

Similar News