బ్రహ్మోత్సవం.. డిజాస్టర్ కా బాప్ హై!!

Update: 2016-05-22 09:40 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ బ్రహ్మోత్సవం.. తొలిరోజు వసూళ్లతోనే నిరాశపరిచిన సంగతి తెలిసిందే. నెగిటివ్ టాక్ వచ్చాక కలెక్షన్స్ డ్రాప్ అవడం సహజమే. కానీ యూఎస్ఏలో ప్రీమియర్స్ ప్రదర్శించే టైంకి ఏ టాక్ కూడా బయటకు వచ్చే ఛాన్స్ లేదు. అక్కడే మొదలైన బ్యాడ్ ట్రెండ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ పై బాగా కనిపించింది. ఇక సెకండ్ డేకి వచ్చేసరికి వసూళ్లు దారుణంగా డ్రాప్ అయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 12.71 కోట్ల షేర్ తో సరిపెట్టుకున్న బ్రహ్మోత్సవం.. రెండో రోజుకు వచ్చేసరికి కేవలం 3 కోట్లు రాబట్టడం ఆశ్చర్యం కలిగించే విషయం. తొలి రోజుతో పోల్చితే నాలుగో వంతు కూడా రెండో రోజు కలెక్షన్స్ లేకపోవడం ఇండస్ట్రీ జనాలకు కూడా మైండ్ బ్లాంక్ చేసింది. కనీసం అడ్వాన్సు బుకింగ్స్ లెక్కలు వేసుకున్నా.. ఇంత కంటే ఎక్కువగానే కలెక్షన్స్ ఉండాలి. తొలి రోజు వసూళ్లలో సగానికి పైగా రెండో రోజు వసూలు చేయకపోతే.. డిజాస్టర్ అనే మాట వాడాల్సి ఉంటుంది.

అలాంటిది ఇప్పుడు బ్రహ్మోత్సవం నాలుగో వంతు కలెక్షన్స్ సాధించలేకపోవడం అంటే.. ఖచ్చితంగా దీన్ని డిజాస్టర్ కా బాప్ అనాల్సిందే. కేవలం థియేటర్ల నుంచి 74 కోట్లకు పైగా రాబడితేనే బ్రహ్మోత్సవం సేఫ్ జోన్ లోకి వెళుతుంది. ఇప్పుడు ట్రెండ్ చూస్తే.. ఇందులో సగం రికవరీ చేయడం కూడా కష్టమే అనే టాక్ వినిపిస్తోంది.


Tags:    

Similar News