ఇప్పుడు అందరి కళ్ళూ ఒక చెప్పుల కంపెనీ యాడ్ పైనే. మనం దీని గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. అసలు మహేష్ బాబు చెప్పు పట్టుకున్న సీన్ ను ఈ చెప్పుల కంపెనీ తమ ప్రమోషన్ కోసం వాడుకుంటోందా.. లేకపోతే ఆ సీన్ ను ఈ కంపెనీ కోసమే సృష్టించారా? సదరు కంపెనీ చేస్తున్న ప్రమోషన్ చూశాక.. అసలే మహేష్ బ్రాండింగ్ లో కింగ్ కాబట్టి.. వారి కోసం ఈ సీన్ పెట్టారంటూ టాక్ బయలుదేరింది.
ఇదే విషయం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల క్లారిటీ ఇచ్చాడు. ''లేదండీ. ఎంతో ప్యూరిటీగా ఉంటే తప్ప ఇలాంటి విషయాలలో హీరో నటించలేరు. తండ్రి మీద ఉన్న ప్రేమను ఎక్సప్లెయిన్ చేయడానికి అలాంటి సన్నివేశాన్ని పెట్టాను. అంతేగానీ యాడ్స్ కోసం కాదు. ముందు సీన్ తీశాం. తరువాత వారు యాడ్ కోసం ఆ ఫోటోను వాడుతున్నట్లున్నారు'' అని సెలవిచ్చాడు. పైగా శ్రీకాంత్ అడ్డాల వంటి సెన్సిబుల్ డైరక్టర్.. యాడ్ కోసం సీన్ పెట్టండి అంటూ పెట్టేరకం కాదు.. అలాగే సినిమాల్లో సీన్ ఉంటేనే మహేష్ కు యాడ్ల వస్తాయా ఏంటి? ఖలేజా సినిమా టైములో మూడేళ్ళు ఖాళీగా ఉన్న టైములోనే బోలెడన్ని యాడ్లు చేశాడు మనోడు.
ఒకవేళ ఈ చెప్పుల పోస్టర్ కాంట్రోవర్సీ కనుక ముదిరితే.. సదరు పోస్టర్లను రీకాల్ చేయడానికి ఆలోచించవద్దని కూడా మహేష్ చెప్పి పెట్టాడట. అది సంగతి.