నవ్వుతూ చురకలు అంటించడం కొందరి కళ. ఇలాంటి కళలో ఆరితేరిపోయాడు మహేష్. ఇటీవలి కాలంలో సినిమాల్లోనే కాదు.. నిగూఢ అర్థం వచ్చేలా మాట్లాడే మీడియా పైనా కుదిరినప్పుడల్లా పంచ్ లు వేస్తూనే ఉన్నాడు. తనని తాను సమర్థించుకునేందుకు ఈ పంచ్ లు అనుకోవాలి. ఏదైతేనేం.. మహేష్ చేస్తున్న సామాజిక సేవనానికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం.
అతడు ఆంద్రా హాస్పిటల్స్ తో కలిసి 1000 మంది పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు నిర్వహించేందుకు ఆర్థిక సాయం అందించారు. ఇపుడు గుండె శస్త్రచికిత్సలు అవసరమయ్యే 125 మంది పిల్లలకు సహాయం చేయడానికి రెయిన్ బో హాస్పిటల్స్ హైదరాబాద్ తో భాగస్వామ్యం కానున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా జరిగిన మీడియా మీట్ లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఈ వేదికపై మహేష్ ట్రేడ్‌మార్క్ చమత్కారం పంచ్ లు కనిపించాయి.
మీడియాతో ప్రసంగంలో మహేష్ నేరుగా రెయిన్ బో హాస్పిటల్స్ తో కలిసి గుండె శస్త్రచికిత్సలు అవసరమైన 125 మంది పిల్లలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఇంతలోనే ఒక విలేఖరి మైక్ తీసుకొని పిల్లలకు గుండె శస్త్రచికిత్సలకు నిధులు ఇవ్వడానికి రెయిన్ బో హాస్పిటల్ తో సహకరిస్తున్నారా అని రెట్టించి అడిగాడు. . దానికి సమాధానంగా మహేష్ ఇలా అన్నాడు. ``నేను ఇంతసేపూ అదే చెబుతున్నాను (నవ్వుతూ). మీరు వేరే స్వభావంలో వ్యాఖ్యానిస్తున్నట్లు కనిపిస్తున్నారు`` అంటూ మహేష్ అన్నారు. అయితే ఆ సందర్భంలో మహేష్ మాటలో చమత్కారం విరుపుతో కూడుకున్న సమాధానం అందరినీ షాక్ కి గురి చేసింది. కానీ ఆయన ఎంతో ఫన్నీగా జాలీగా ఆ సన్నివేశాన్ని హ్యాండిల్ చేసిన తీరు ఆసక్తికరం. ఇక సదరు రిపోర్టర్ ప్రశ్న కూడా అంతే నర్మగర్భంగా ఉండడం విశేషం.
సర్కార్ వారి పాట సంగతేంటి?
మహేష్ కథానాయకుడిగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `సర్కారు వారి పాట` సమ్మర్ కానుకగా మే 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో చిత్రయూనిట్ ప్రచారం ప్రారంభించింది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లతో హీటెక్కించిన మహేష్ అండ్ కో సినిమాకి మరింత హైప్ తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. అటు మ్యూజికల్ గానూ సినిమాను హైలైట్ చేస్తున్నారు. ఇటీవలే `కళావతి` అంటూ సాగే తొలి లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఈ పాట శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. ఇందులో కళావతి పాత్ర చాలా స్పెషల్ అని అర్థమైంది.
మహేష్ పాత్ర రగ్గడ్ యాటిట్యూడ్ తో మాసీగా కనిపిస్తోంది. అలాంటి కుర్రాడు ఒక్కసారిగా స్త్రీ స్పర్శకు గురైతే ఏం జరిగింది? అన్నదే ఈ సినిమా సారాంశం. మహేష్ ఇప్పటివరకూ ఇలాంటి పాత్రలో కనిపించలేదు. సున్నితమైన పాత్రల్లోనే ఎక్కువగా కనిపించారు. దీంతో `ఎస్ వీపీ`లో మహేష్ పాత్ర సంవిధానం కొత్తగా ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. అలాగే మహేష్ ని పరశురామ్ తనదైన శైలిలో కంపర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చాడని ప్రూవ్ అవుతోంది. సినిమాలో కమర్శియల్ అంశాలు పుష్కలంగా జొప్పించినట్లు కళావతి పాట..మహేష్ క్యారెక్టరైజేషన్ బట్టి అభిమానులు గెస్ చేస్తున్నారు. దీంతో మహేష్ పాత్రని `గీత గోవిందం`లో విజయ్ దేవరకొండ విజయ్ అనే పాత్రకు పూర్తి కాంట్రాస్ట్ గా భావించవచ్చు. ఇంకా పుల్ క్లారిటీ రావాలంటే ట్రైలర్ రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
ప్రస్తుతం `సర్కారి వారి పాట` పోస్ట్ ప్రొడక్షన్ ల్లో ఉంది. మహేష్ డబ్బింగ్ పనులు పూర్తిచేసి కొత్త సినిమా షూట్ లో బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ ని దుబాయ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇందులో మహేష్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.