సరిలేరు నీకెవ్వరు' తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహించబోయే సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. గత ఏడాది సంక్రాంతి సీజన్లో సూపర్ హిట్ గా నిలిచిన 'F2' చిత్రానికి సీక్వెల్ గా 'F3' ని తెరకెక్కించే ఆలోచనలో అనిల్ రావిపూడి ఉన్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో నటించేందుకు వెంకటేష్.. వరుణ్ తేజ్ లతో పాటుగా మహేష్ బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.
ఈ సినిమాలో నటించేందుకు సూపర్ స్టార్ భారీ రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో మహేష్ పాత్ర 40 నిముషాలు మాత్రమే ఉంటుందని.. షూటింగ్ కోసం మహేష్ జస్ట్ 30 రోజులు డేట్స్ ఇస్తారని అంటున్నారు. ఈ పార్ట్ అంతా ఒకే షెడ్యూల్ లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో నటించినందుకు మహేష్ బాబుకు 'F3' నాన్ థియేట్రికల్ రైట్స్ పారితోషికంగా ఇవ్వాలనే ఒప్పందం కుదిరిందని అంటున్నారు. ఈలెక్కన మహేష్ కు అతి తక్కువ సమయంలో భారీ రెమ్యూనరేషన్ ముడుతుందని చెప్పకతప్పదు.
ఇదిలా ఉంటే మహేష్ బాబు ఎవరైనా డైరెక్టర్ తో రెండోసారి పనిచేసినప్పుడు దాదాపుగా ఆ సినిమాలు డిజాస్టర్లుగా మారాయి. పూరి జగన్నాధ్(బిజినెస్ మేన్).. కొరటాల శివ(భరత్ అనే నేను) మాత్రమే ఈ సెంటిమెంట్ కు మినహాయింపు. మిగతా దర్శకులు మాత్రం ఒకరిని మించి మరొకరు మహేష్ కు డిజాస్టర్లు ఇచ్చారు మరి ఈ సినిమాతో అనిల్ రావిపూడి ఆ గండం దాటగలడా లేదా అనేది వేచి చూడాలి.