నా జీవితంలో ప్ర‌త్యేక‌మైన రోజు -మ‌హేష్

Update: 2019-04-21 04:52 GMT
అమ్మ అన్న పిలుపులోని క‌మ్మ‌ద‌నం ఇక ఈ సృష్టిలో ఇంకేదీ లేదు. అమ్మ ను మించిన దైవాన్ని ఇల‌లో క‌న‌లేం. అందుకే అమ్మ అంటే అంత గొప్ప సెంటిమెంటు. ఆ సెంటిమెంట్ తో ఎంద‌రో ద‌ర్శ‌కులు క‌థ‌లు రాసుకుని గొప్ప చిత్రాల్ని తెర‌కెక్కించారు. అదంతా స‌రే.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ కి అమ్మ అంటే ఎంత ప్రేమ‌.. ఎంత ఎమోష‌నో.. ఇదిగో ఈ ట్వీట్ చెబుతోంది. భార్య న‌మ్ర‌త .. అమ్మ ఇందిర దేవి గారు మ‌హేష్ కి రెండు క‌ళ్లు. ఆ ఇద్ద‌రి విష‌యంలో త‌న ఎమోష‌న్ ప్ర‌తి సంద‌ర్భంలో బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది.

నిన్న  హేష్ మాతృమూర్తి ఇందిర దేవి బ‌ర్త్ డే. ఈ సంద‌ర్భంగా ఎమోష‌నల్ గా ట్వీట్ చేశారు. ``నా జీవితంలో ఎంతో ప్ర‌త్యేక‌మైన రోజు ఇది. హ్యాపీ బ‌ర్త్ డే అమ్మా!`` అంటూ ఎంతో ఉద్వేగంగా ట్వీట్ చేశారు మ‌హేష్‌. త‌న త‌ల్లి గారైన ఇందిర దేవి ఫోటోని ఈ సంద‌ర్భంగా అభిమానుల కోసం మ‌హేష్ ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు. ఈ ఫోటోని చూడ‌గానే అభిమానుల‌కు మ‌రో విష‌యంపైనా పూర్తి క్లారిటీ వ‌స్తుందేమో! మ‌హేష్ అచ్చం నాన్న (సూప‌ర్ స్టార్ కృష్ణ‌) పోలిక అని అంద‌రూ భావిస్తారు. కాదు అమ్మ పోలిక అని కూడా ఈ ఫోటో చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఆ ముకు తీరు.. ముఖాకృతి పోలిక‌లు సేమ్ టు సేమ్ అని అభిమానులు ఫీల‌వుతున్నారు. ఇక ఇందిర దేవి ప‌బ్లిక్ అప్పియ‌రెన్స్ చాలా రేర్. అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే ప‌బ్లిక్ ఫంక్ష‌న్ల‌లో క‌నిపిస్తుంటారు. బంధుమిత్రుల ఇళ్ల‌లో ఫ్యామిలీ ఫంక్ష‌న్ల‌కు మ‌హేష్ తో క‌లిసి ఇందిరమ్మ ఎటెండ్ అవుతుంటారు. అమ్మ పై మ‌హేష్ తాజా ట్వీట్ నెటిజ‌నుల్లో జోరుగా వైర‌ల్ అయిపోతోంది.

మ‌హేష్ న‌టిస్తున్న కెరీర్ 25వ చిత్రం `మ‌హ‌ర్షి` మే9న అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో మ‌రింత వేగం పెంచనున్నార‌ట‌. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన సింగిల్స్ కి మిక్స్ డ్ రెస్పాన్స్ వ‌చ్చింది. మిగ‌తా పాట‌లు.. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ఎలా ఉంటాయోన‌న్న ఎగ్జ‌యిట్ మెంట్ అభిమానుల్లో ఉంది. `భ‌ర‌త్ అనే నేను` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత మ‌హేష్ మ‌రోసారి అంత గొప్ప ట్రీటిస్తారా? అంటూ ఉత్సాహంగా వేచి చూస్తున్నారంతా. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు- అశ్వ‌నిద‌త్ - పీవీపీ త్ర‌యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News