సెట్ లో దర్శకుడు ఇచ్చిన స్క్రిప్టు పేపర్ చేత పట్టుకొని, ఒక్కో డైలాగుని పదిసార్లు చదువుకొని భట్టీ పడితే తప్ప నటీనటులు కెమెరా ముందు ధైర్యంగా చెప్పలేరు. అలాంటిది మహేష్ బాబు స్క్రిప్టు పేపరు ఏమాత్రం చదవకుండా కేవలం దర్శకుడు చెప్పింది వినేసి ఆ డైలాగుల్ని గడగడా పలికేస్తాడట. షాట్ కూడా సింగిల్ టేక్ లోనే ఓకే చేసేస్తుంటాడట. నిజంగా... గ్రేటే కదా! ఇంతకీ మహేష్ స్క్రిప్టు పేపరు ఎందుకు చదవడనే సందేహం మీకు రావొచ్చు. అందుకు బలమైన కారణమే ఉంది. మహేష్ కి తెలుగు చదవడం రాదట. ఆశ్చర్యకరమైన ఆ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూ లో బయటపెట్టాడు. ``నాకు తెలుగు మాట్లాడటం వచ్చు కానీ, చదవడం మాత్రం రాదు. అందుకే దర్శకుడి నుంచి డైలాగుల్ని చెప్పించుకొని కెమెరా ముందుకెళతా`` చెప్పుకొచ్చాడు మహేష్.
మహేష్ బాల్యమంతా మద్రాస్ లో గడిచింది. అక్కడే చదువుకొన్నాడు. అంతా ఇంగ్లీష్ చదువులే. అందుకే తెలుగుపై ఆయన పట్టు పెంచుకోలేకపోయారు. సినిమా రంగంలోకి వచ్చాక ఇబ్బందిగా మారుతుందేమో అనుకొన్నాడట మహేష్. కానీ ఆయన దర్శకులు చెప్పిన డైలాగుల్ని గుర్తు పెట్టుకొని పలకడం నేర్చేసుకొన్నాడట. ఎంత పెద్ద డైలాగుల్నైనా అలా వినేసి ఇలా సింగిల్ టేక్ లో చెప్పేస్తాడట. అలాంటి మెమరీ పవర్ నాకు ఉండటం గాడ్ గ్రేస్ అంటున్నాడు మహేష్. తన తండ్రి కృష్ణగారికి కూడా అలాంటి మెమరీ పవరే ఉందట. ``నాన్నగారు ఎంత పెద్ద డైలాగుల్నైనా అలవోకగా చెప్పేస్తుంటారు. ఆ పవర్ నాకూ వారసత్వంగా సంక్రమించింద``ని మహేష్ చెప్పుకొచ్చాడు. `శ్రీమంతుడు` చిత్రీకరణ సమయంలో మహేష్ సింగిల్ టేక్ లో డైలాగులు చెప్పి షాట్లు ఓకే చేస్తుండడం చూసి జగపతిబాబు కూడా ఆశ్చర్యపోయారట.