ఆటలన్నాక గెలుపోటములు సహజం. సినిమాలన్నాక హిట్లు ఫ్లాపులు మామూలే. ఈ విషయం ఆడే వాళ్లకు తెలియంది కాదు.. సినిమా స్టార్లూ అర్థం చేసుకోలేంది కాదు. అయినప్పటికీ కొందరు సూపర్ స్టార్లు సైతం ఫెయిల్యూర్లను తట్టుకోలేరు. ఫెయిల్యూర్ రాగానే కుంగిపోతుంటారు. అలాంటి వాళ్లలో తానూ ఒకడినని స్వయంగా చెప్పుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. తాను ఫ్లాప్ వస్తే తట్టుకోలేనని.. ముఖ్యంగా ‘ఆగడు' డిజాస్టర్ అయినప్పుడు ఎవ్వరినీ కలవలేదని.. ఎక్కువగా మాట్లాడలేదని.. రెండు మూడు నెలలు అసలు బయటికి అడుగు పెట్టడానికి కూడా ఇష్టపడలేదని వెల్లడించాడు మహేష్ బాబు.
ఐతే ‘ఆగడు'తో పోలిస్తే ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం' మహేష్ ను ఇంకా పెద్ద దెబ్బే కొట్టింది. ఆగడు కాన్షియస్ గా చేసిన ఓ బ్లండర్ గా భావించవచ్చు. కానీ ‘బ్రహ్మోత్సవం' అలా కాదు. ఓ మంచి సినిమా చేస్తున్నామని మహేష్ నమ్మాడు. శ్రీకాంత్ అడ్డాల మీద అపారమైన నమ్మకం పెట్టుకున్నాడు. ఇది తనకు ఓ మెమొరబుల్ సినిమా అవుతుందని ఆశించాడు. కానీ ఫలితం చూస్తే అంచనాలన్నీ తిరగబడ్డాయి. ‘1 నేనొక్కడినే' సినిమాలాగా మంచి సినిమా చేశానన్న సంతృప్తి కూడా లేదు. అన్ని వైపుల నుంచి తిట్లే తీసుకోవాల్సి వస్తోంది. ఇక ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ కాబోతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహేష్ కెరీర్లోనే ఇది అత్యంత భారీ నష్టాన్ని మిగిల్చిన సినిమా అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి ఈ ఫెయిల్యూర్ ను మహేష్ ఎలా తట్టుకుంటాడో చూడాలి. ‘ఆగడు' టైంలో లాగా ఎవ్వరినీ కలవను.. బయటికి రాను అంటే కష్టమే. మహేష్ కోసం మురుగదాస్ కొన్ని నెలలుగా వెయిట్ చేస్తున్నాడు. జూన్ రెండో వారంలో సినిమా మొదలుపెట్టడానికి సన్నాహాలు కూడా చేసుకున్నాడు. మరి మహేష్ యధావిధిగా షూటింగ్ మొదలుపెట్టనిస్తాడా..? ఒకవేళ ఓకే అన్నా కెమెరా ముందు మామూలుగా నటించే మానసిక స్థితిలోనే ఉంటాడా..? అన్నది డౌటే.