మహేష్ డిప్రెషన్లో ఉన్నాడన్నమాటే..

Update: 2016-06-21 06:38 GMT
తెరమీద హీరోలు చాలా గొప్పోళ్లు. ఎలాంటి పరిస్థితుల్లోనూ నిబ్బరం కోల్పోకూడదని చెబుతారు. కష్టాలు ఎదురైనపుడే ఎదురొడ్డి నిలవాలని చెబుతారు. గెలుపోటములు సహజమని.. ఓటమి ఎదురైనపుడు కుంగిపోకూడదని అంటారు. ఇంత చెప్పేవాళ్లు నిజ జీవితంలోకి వచ్చేసరికి ఫెయిల్యూర్ ఎదురవగానే డీలా పడిపోతుంటారు. మహేష్ బాబు సహా చాలామంది పరిస్థితి ఇదే. తన సినిమా ఫ్లాప్ అయితే తాను డిప్రెషన్లోకి వెళ్లిపోతానని.. ‘ఆగడు’ సినిమా రిజల్ట్ చూశాక రెండు నెలలు ఇంట్లోంచి అసలు బయటికే రాలేదని.. ఎవ్వరితోనూ మాట్లాడలేదని చెప్పి ఆశ్చర్యపరిచాడు మహేష్. ఇది చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఐతే ఈ సంగతి ఒకసారి బయటికి చెప్పుకున్నాడు కాబట్టి ఇకపై ఇలా చేయడేమో అనుకున్నారంతా.

కానీ ‘బ్రహ్మోత్సవం’ రిజల్ట్ మహేష్ ను మరోసారి డిప్రెషన్లోకి నెట్టినట్లు కనిపిస్తోంది. ఆ సినిమా రిలీజైననాటి నుంచి అడ్రస్ లేడు మహేష్. విడుదలకు ముందు ప్రమోషన్లలో జోరుగా పాల్గొన్న మహేష్.. తర్వాత కనిపించలేదు. కొన్ని రోజులు ఇంటికే పరిమితమయ్యాడు. తర్వాత వెకేషన్ కు వెళ్లిపోయాడు. ‘ఫిలిం ఫేర్’ అవార్డులకు రమ్మని నిర్వాహకులు ఎంతగానో అడిగినా మహేష్ రాలేదు. గతంలో ఆ సంస్థ అవార్డు ఇస్తే వచ్చి అందుకున్నాడు. మా టీవీ.. సాక్షి టీవీ అవార్డులు సైతం అందుకున్న మహేష్.. ఫిలిం ఫేర్ అవార్డు అందుకోవడానికి మాత్రం రాలేదు. ఉద్దేశపూర్వకంగానే ఈ కార్యక్రమానికి మహేష్ దూరమైనట్లు తెలుస్తోంది. బ్రహ్మోత్సవం బాధ నుంచి మహేష్ ఇంకా బయటపడలేదని.. ఈ స్థితిలో బయటికి వస్తే అతడి బాధంతా బయటికి కనిపిస్తుందని.. ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి రాకుండా ఉండిపోయాడని అంటున్నారు. మురుగదాస్ సినిమా అనుకున్న సమయానికి మొదలుకాకపోవడానికి కూడా మహేష్ డిప్రెషనే కారణమంటున్నారు. ‘ఆగడు’ లెక్క ప్రకారం చూస్తే ఇంకో నెల రోజులు మహేష్ బయట కనిపించడన్నమాట.
Tags:    

Similar News