మళ్ళీ రెగ్యులర్ లుక్ లో మహేష్ బాబు

Update: 2019-06-04 09:45 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో ప్రస్తుతం యూరోప్ ట్రిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. 'మహర్షి' ప్రమోషన్స్ ముగిసిన తర్వాత సమ్మర్ వెకేషన్ కోసం వెళ్ళిన మహేష్ ప్రస్తుతం తన హాలిడేని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు.  ఇప్పటికే ఆ ట్రిప్ కు సంబంధించిన కొన్ని  ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు.  మహేష్ సతీమణి నమ్రత కూడా తాజాగా  అభిమానులతో ఒక ఫోటో షేర్ చేసుకుంది.  

ఈ ఫోటోలో మహేష్ బాబు.. సితార.. గౌతమ్ ఉన్నారు.  ఈ ఫోటోలో  క్లీన్ షేవ్ లో కనిపిస్తున్న మహేష్ మళ్ళీ తన రెగ్యులర్ స్టైల్ కు మారిపోయాడు. 'మహర్షి' కోసం మహేష్ తన లుక్ ను మార్చి గడ్డంతో కనిపించిన మహేష్ ఆ సినిమా తర్వాత మళ్ళీ పూర్వపు లుక్ లోకి రావడం గమనార్హం. మహేష్ కొత్త సినిమా 'సరిలేరు నీకెవ్వరూ' ఈమధ్యే లాంచ్ అయింది.  రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరులోనే ప్రారంభం అవుతుందని అంటున్నారు. మరి ఈ సినిమాలో అనిల్ రావిపూడి మహేష్ ను ఎలాంటి లుక్ లో చూపిస్తాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫోటోలో మహేష్ ను చూస్తుంటే మాత్రం కొత్త సినిమా కోసం మేకోవర్ లేనట్టేననిపిస్తోంది.  

ఈ ఫోటోలో మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే మహేష్ కింద స్టార్ డిజైన్ ఉంది.  నెటిజనులకు నమ్రత మరోసారి మహేష్ సూపర్ స్టార్ అని ఇన్ డైరెక్ట్ గా గుర్తు చేయడమేమో.  ఈ ఫోటోకు  "నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తులు.. చాలా కూల్ #లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ #సెలేబ్రేటింగ్ మహర్షి" అంటూ నమ్రత క్యాప్షన్ ఇచ్చారు.

Tags:    

Similar News