సెకండ్‌ లుక్‌: స్టయిలిష్‌ శ్రీమంతుడు

Update: 2015-07-13 11:51 GMT
మొన్నటివరకు 3/4 షార్టు వేసుకొని విలేజ్‌లో సైకిల్‌ తొక్కుతూ తన రిచ్‌నెస్‌ను చూపించిన స్టారాది స్టారుడు ఇప్పుడు క్లాస్‌ లుక్‌లో క్లాసిక్‌గా వచ్చేశాడు. జూలై 18న ఆడియో లాంచ్‌ను పురస్కరించుకొని ఇప్పుడు మహేష్‌ బాబు ''శ్రీమంతుడు'' కొత్త లుక్‌తో కొత్తగా పలకరించడానికి రెండోసారి లైన్‌లోకి దిగాడు.

ఫస్ట్‌ లుక్‌లో కేవలం తన లుక్స్‌ను మాత్రమే పరిచయం చేసిన మహేష్‌, ఇప్పుడు సెకండ్‌ లుక్‌లో తన స్టయిల్‌ను కూడా పరిచయం చేశాడు. వెయిస్ట్‌ కోటులో, నెత్తిన ఒక బ్యాగీ క్యాప్‌ పెట్టుకొని.. అబ్బో యమా స్టయిలిష్‌గా ఉన్నాడు. మరి ధనవంతులు వారసుడు అంటే ఈ రేంజులో లేకపోతే ఎలా. చూస్తుంటే ఈ స్టిల్‌ ఏదో పాటలోనిది అని అనిపిస్తోంది.. బట్‌ ఆ వాక్‌ ఉంది చూశారూ.. మహేష్‌ను పదే పదే ఫ్యాన్స్‌ అందరూ కలసి మోస్ట్‌ డిజైరబుల్‌ మ్యాన్‌గా ఎందుకు ఎన్నుకుంటున్నారో ఇప్పుడు అర్ధమవుతోంది.

కొరటాల శివ డైరక్షన్‌లో రూపొందిన ఈ ''శ్రీమంతుడు'' ఆగస్టు 7న జనాలను పలుకరించడానికి వస్తున్నారు. నిజానికి వచ్చే శుక్రవారం రావాలి, కాకపోతే బాహుబలి కి సైడిచ్చి తాను కాస్త లేటుగా వస్తున్నాడు.
Tags:    

Similar News