మహేష్ మదిలో ‘దళపతి’ జ్నాపకం

Update: 2017-04-16 11:06 GMT
తన జీవితంలో హైదరాబాద్ కంటే చెన్నై పాత్రే ఎక్కువంటున్నాడు సూపర్ స్టార్ మహేష్. హైదరాబాద్ లో తాను ఉంటోంది పదిహేనేళ్లుగా మాత్రమే అని.. అంతకుముందు పాతికేళ్ల తన జీవితం చెన్నైలోనే సాగిందని.. పైగా సినిమా హీరో కాకముందు సాధారణ జీవితమంతా చెన్నైలోనే గడపడం.. ఒక సామాన్యుడిలా తిరగడం వల్ల ఆ నగరంతో తనకు గొప్ప అనుబంధం ఉందని మహేష్ తెలిపాడు. తన కొత్త సినిమా ‘స్పైడర్’ను తమిళంలోనూ తెరకెక్కించి.. ఒకేసారి తమిళనాడులోనూ రిలీజ్ చేయనున్న నేపథ్యంలో అక్కడి మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు మహేష్ అందులో.. చెన్నైతో తన అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు మహేష్.

‘‘చెన్నైతో నాకు గొప్ప అనుబంధం ఉంది. నా బాల్యం.. విద్యాభ్యాసం ఇక్కడే సాగింది. నేను ఇక్కడ ఒక సామాన్యుడిలాగానే పెరిగాను. మా నాన్న సూపర్ స్టార్ అని చాలామందికి తెలియదు. స్కూల్లో కూడా ఆయన గురించి తెలియకుండా చూసుకున్నాం. నేనక్కడ మామూలు కుర్రాడిలాగానే చదువుకున్నాను. సూర్య.. కార్తి.. యువన్ శంకర్ రాజా.. వీళ్లందరూ నాతో పాటే కలిసి చదువుకున్నారు. నేను స్కూల్లో చదువుకునే సమయంలో ‘దళపతి’ అనే సినిమా చూశాను. ఆ వయసులోనే నన్ను ఆ సినిమా అమితంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా అందులో ఛాయాగ్రహణం నా మదిలో చెరగని ముద్ర వేసింది. ఆ సినిమాకు ఛాయాగ్రహణం అందించింది సంతోష్ శివన్ అని తెలిసింది. ఆయన ఇప్పుడు నా సినిమా ‘స్పైడర్’కు పని చేస్తుండటం చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తోంది’’ అని మహేష్ తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News