ప్రముఖ నటుడు మహేష్ బాబుకు చెందిన రెండు బ్యాంకు అకౌంట్లను జీఎస్ టీ కమిషనరేట్ కార్యాలయం జప్తు చేసిన సంగతి తెలిసిందే. గడచిన పదేళ్ళ నుంచి సర్వీస్ ట్యాక్ బకాయిలు కట్టనందున బ్యాంకుల నుంచి సొమ్మును రికవర్ చేసినట్లు హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. అయితే, తన బ్యాంక్ ఖాతాలను జీఎస్టీ అధికారులు సీజ్ చేయడంపై మహేష్ బాబు తన లీగల్ టీమ్ ద్వారా వివరణ ఇప్పించారు. ఈ మేరకు శుక్రవారం వారొక ప్రకటన విడుదల చేశారు.
2007-08లో వివిధ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా పాల్గొన్నందుకు - ఆయా కంపెనీల ఉత్పత్తుల ప్రకటనల్లో నటించి తన సేవలు అందించారని - దీనికిగాను వసూలు చేసిన రెమ్యూనరేషన్ పై మహేష్ బాబు సర్వీస్ ట్యాక్స్ కట్టలేదని పేర్కొంది. 2007-08 నాటి బకాయి రూ. 18.5 లక్షలు కాగా - ఆ తరవాత కూడా సదరు సేవలకు ఆయన సర్వీస్ ట్యాక్స్ కట్టేలేదని పేర్కొంది. ప్రస్తుతం మహేష్ బాబు సర్వీస్ ట్యాక్స్ బకాయి రూ. 39 లక్షలు దాకా చేరిందని కమిషనరేట్ తెలిపింది. బకాయిలతో పాటు వాటిపై వడ్డీ - పెనాల్టి కలిపి రూ. 73.5 లక్షలకు చేరినట్లు వివరించింది. బకాయిలు వసూలులో భాగంగా మహేష్ బాబుకు చెందిన యాక్సిస్ బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ. 42.96 లక్షలను తాము రికవర్ చేసినట్లు తెలిపింది. అలాగే ఆయనకు ఐసీఐసీఐ బ్యాంక్ లో ఉన్న ఖాతాను కూడా జప్తు చేశామని - అయితే ఖాతా నుంచి ఇంకా డబ్బు బదిలీ కాలేదని పేర్కొంది. రేపటి లోగా బ్యాంక్ సదరు మొత్తాన్ని తమ శాఖకు బదిలీ చేయాలని - లేని పక్షంలో ఆ బ్యాంక్ పై కూడా చర్య తీసుకుంటామని కమిషనరేట్ హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో మహేష్ బాబు లీగల్ టీమ్ వివరణ ఇచ్చింది. 2007– 08 ఆర్ధిక సంవత్సరానికి గాను అంబాసిడర్ సర్వీసెస్‌కి సేవల పన్ను చెల్లించాలంటూ అధికారులు కోరుతున్నారని తెలిపింది. వాస్తవానికి ఆ కాలంలో అంబాసిడర్ సర్వీసెస్ ఎటువంటి టాక్స్ పరిధిలోకి రాదని న్యాయవాదులు చెప్పారు. అంబాసిడర్ సర్వీసెస్ ని టాక్స్ పరిధిలోకి సెక్షన్ 65 (105) (zzzzq ) ద్వారా 01 -07 -2010 తేదీ నుంచి చేర్చారని వివరించారు. మహేశ్ బాబు చట్టపరమైన అన్ని నియమాలకు లోబడే ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. కోర్ట్ పరిధిలో ఉన్న అంశంలో కలుగజేసుకున్న హైదరాబాద్ లోని జీఎస్టీ కమిషనరేట్ అధికారులు మహేష్ బాబు బ్యాంక్ అకౌంట్ల సీజ్ ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. రూ.18 లక్షల 50 వేలు ఉన్న పన్నుని వడ్డీతో కలిపి రూ. 73 లక్షల 50 వేలుగా నిర్ణయించి బ్యాంకు అకౌంట్ల నిలుపుదలకు ఆదేశించారని చెప్పారు. జీఎస్టీ అధికారులు ఎటువంటి నోటీసు లేకుండా మహేశ్ బాబుపై చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ విషయం ఇంకా కోర్ట్ పరిధిలో ఉన్నప్పటికీ జీఎస్టీ కమిషనరేట్… బ్యాంకు అకౌంట్ల నిలిపివేయాలని ఆదేశించిందని చెప్పారు. మహేష్ బాబు చట్టానికి కట్టుబడే పౌరునిగా తన పన్నులన్నిటినీ సక్రమంగా చెల్లించారని ఆయన తరఫు లాయర్లు ప్రెస్ నోట్ లో వివరించారు.