వెటరన్ నటి .. టాలీవుడ్ కి అమ్మ వంటి దర్శకనటి విజయనిర్మల(73) మరణం సినీవర్గాల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ మరణం పరిశ్రమకు తీరని లోటని పరిశ్రమ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలుగు సినీ గర్వించదగ్గ మల్టీ ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ కం డైరెక్టర్ విజయనిర్మల గారు అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తెలుగు వారు గర్వించదగ్గ గొప్ప దర్శకురాలు అని నందమూరి బాలకృష్ణ గుర్తు చేశారు. ఆమె మరణం పరిశ్రమకు తీరని లోటు అని అగ్రహీరోలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు విజయ నిర్మల మరణం కలతకు గురి చేసిందని విచారాన్ని వ్యక్తం చేశారు.
ఈ మరణ వార్త విన్న అనంతరం.. ఈనెల 28న జరగాల్సిన `మహర్షి` 50 రోజుల ఈవెంట్ ని చిత్రబృందం క్యాన్సిల్ చేసారని తెలుస్తోంది. మహేష్ కథానాయకుడిగా నటించిన మహర్షి అర్థశతదినోత్సవానికి ఇప్పటికే హైదరాబాద్ లో ఓవైపు ఏర్పాట్లు సాగుతున్నాయి. నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిధిగా ఈ వేడుక జరగనుందని ఇదివరకూ సమాచారం అందింది. అయితే అమ్మ ఆకస్మిక మరణంతో ఆమెకు గౌరవంగా ఈ వేడుకను క్యాన్సిల్ చేశారని తెలిసింది. ఈ శుక్రవారం ఆమె వారసుడు సీనియర్ నరేష్ సహా సూపర్ స్టార్ కృష్ణ - మహేష్ విజయనిర్మల అంత్యక్రియల్ని నిర్వహిస్తున్నారు.
విజయ నిర్మల కుమారుడు.. నటుడు సీనియర్ నరేష్ అందుకు సంబంధించిన వివరాల్ని ట్వీట్ చేశారు. ``అమ్మ.. సీనియర్ ఆర్టిస్ట్ .. దర్శకనిర్మాత డా.జి.విజయనిర్మల గారు మరణించారని చెప్పేందుకు చింతిస్తున్నా. హైదరాబాద్ కాంటినెంటల్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ.. నేటి వేకువఝామున (27 జూన్ 2019) అమ్మ మరణించారు. తన వయసు 73. నానక్ రామ్ గూడ ఇంటి వద్ద తన భౌతిక ఖాయాన్ని సందర్శన కోసం ఉంచాం. రేపు ఉదయం అంత్య క్రియలు జరుగుతాయి. ఇతర సమాచారం తెలియజేస్తాం`` అని ట్విట్టర్ లో తెలిపారు.