సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి మే 9 విడుదలకు రెడీ అవుతోంది. ఇంకా బాలన్స్ పార్ట్ తాలుకు షూటింగ్ కొంత పెండింగ్ ఉంది. అది ఈ నెలలో ఫినిష్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ లో కొన్ని రెగ్యులర్ కమర్షియల్ అంశాలు ఉన్నట్టు అనిపించినా మిలియన్ల వ్యూస్ తో మాస్ ప్రేక్షకులకు కావాల్సింది ఇందులో ఉందన్న గ్యారెంటీతో ఆన్ లైన్ లో దూసుకుపోతోంది
ట్రేడ్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం తీసుకున్న ముగ్గురు నిర్మాతలకు మహర్షి బంగారు గుడ్డులా మారింది. రిలీజ్ కు ముందే సుమారు 140 కోట్ల దాకా బిజినెస్ జరిపి కొత్త రికార్డులు సృష్టించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది.
ఒక్క థియేట్రికల్ బిజినెస్ నుంచే 90 కోట్ల దాకా వస్తుందని అంచనా. ఏపిలో ఎన్నికల వేడి తీవ్రంగా ఉంది కాబట్టి కొన్ని ఏరియాలకు బిజినెస్ డీల్స్ పూర్తి కావలసి ఉంది. పోలింగ్ అయిపోగానే ఇవి కొలిక్కి వస్తాయి. ఇక ఇతరత్రా హక్కుల రూపంలో మరో 50 కోట్లు మహర్షి తన జేబులో వేసుకుంటాడు.
డిజిటల్ హక్కులు 11 కోట్ల దాకా తెచ్చిపెట్టగా హిందితో పాటు ఇతర బాషల డబ్బింగ్ రూపంలో 20 కోట్లు వచ్చాయని చెబుతున్నారు. తెలుగు శాటిలైట్ కూడా కళ్ళు చెదిరే మొత్తం తేవడం ఖాయమనే మాట విన్పిస్తోంది. ఓవర్సీస్ డీల్ ని 12 కోట్ల 50 లక్షల దాకా క్లోజ్ చేశారని వినికిడి. మొత్తానికి మహర్షి కాసుల వర్షంలో ముందు నిర్మాతలను తర్వాత బయ్యర్లను తడిపి ముద్దచేసేలా ఉన్నాడు. ఇక ప్రేక్షకుల తీర్పు కనక పాజిటివ్ గా వస్తే టార్గెట్ ఫస్ట్ రంగస్థలం తర్వాత బహుబలే