సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25వ సినిమా మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదివరకూ రిలీజైన టీజర్ కి - మహేష్ న్యూలుక్ కి అద్భుత స్పందన వచ్చింది. కాలేజ్ విద్యార్థిగా - రైతుగా విభిన్నమైన గెటప్పుల్లో మహేష్ కనిపిస్తాడని ప్రచారమైంది. ఈ సినిమాకి షారూక్ నటించిన ఓ క్లాసిక్ సినిమా స్ఫూర్తి అన్న ప్రచారం సాగుతోంది.
భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరో బ్లాక్ బస్టర్ పై కన్నేశాడు మహేష్. అందుకు తగ్గట్టే వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని ఎంతో జాగ్రత్తగా అన్ని అంశాల మేళవింపుతో పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నారు. దిల్ రాజు - అశ్వనిదత్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. 2019 వేసవి సెలవులకు ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇదివరకూ ఏప్రిల్ 29 రిలీజ్ తేదీ అంటూ ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు నిర్మాతల ఐడియా మారిందిట. కాస్త `ముందస్తు`గానే వచ్చేస్తే బావుంటుందని టీమ్ భావిస్తోందిట. రికార్డ్ బ్రేకింగ్ సెన్సేషనల్ మూవీ `బాహుబలి 2` రిలీజ్ తేదీకే `మహర్షి` చిత్రాన్ని రిలీజ్ చేస్తే ఆ మేరకు హైప్ వసూళ్లకు కలిసొస్తుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. బాహుబలి 2 చిత్రం ఏప్రిల్ 5న రిలీజైంది. అంటే మూడు వారాల ముందే `మహర్షి` చిత్రాన్ని రిలీజ్ చేస్తే బావుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇటీవల నాన్ బాహుబలి కేటగిరీలో రికార్డుల గురించి ప్రత్యేకంగా ముచ్చటిస్తున్న వేళ మహేష్ సినిమా ఆ రికార్డుల్లో టాప్ రేంజును టచ్ చేస్తుందా? బాహుబలి సెంటిమెంటు ఈ సినిమాకి కలిసొస్తుందా? రెట్టించిన అంచనాల నడుమ ఏం జరుగుతుందో? అంటూ ఒకటే ఆసక్తికర చర్చ మొదలైంది. రంగస్థలం - భరత్ అనే నేను - అరవింద సమేత చిత్రాలు భారీ ఓపెనింగులతో నాన్ బాహుబల రికార్డుల్ని సృష్టించాయి. ఆ కేటగిరిలో వస్తున్న మరో భారీ చిత్రం `మహర్షి` అంచనాల్ని అందుకుంటుందా.. అన్నది చూడాలి.