దాదాపు మూడేళ్ల నుంచి మహేష్ బాబు - శేఖర్ కమ్ముల కాంబినేషన్ గురించి చర్చ జరుగుతోంది. ఐతే అది మెటీరియలైజ్ అవుతుందా లేదా అని ఎప్పుడూ సందేహమే. ఎందుకంటే కమ్ముల ఫామ్ అలా ఉందిప్పుడు. ఐతే కమ్ముల ఫామ్ గురించి కాకుండా కంటెంట్ మీద నమ్మకంతో మహేష్ ఛాన్స్ ఇచ్చే అవకాశాల్ని కూడా కొట్టిపారేయలేం. అందుకే ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్టు వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఐతే ‘అనామిక’ తర్వాత కమ్ముల అసలు లైమ్ లైట్ లోనే లేకుండా పోయాడు. పైగా ఇప్పుడు హ్యాపీడేస్ హిందీ రీమేక్ లైన్ లోకి రావడంతో మహేష్ తో అతడి సినిమా అటకెక్కినట్లే అనుకున్నారంతా.
ఐతే తాజా సమాచారం ప్రకారం మహేష్, కమ్ముల పక్కకు వెళ్లలేదట. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ అయిన జయంత్ సి పరాన్జీ ఈ సినిమాని మళ్ళీ తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. మహేష్ - శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో సినిమాను ఆయనే నిర్మించబోతున్నట్లు తెలిసింది. మహేష్ తో ఇంతకుముందు జయంత్ ‘టక్కరిదొంగ’ సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫ్లాప్ అయినా జయంత్ తో మహేష్ మంచి రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆ సాన్నిహిత్యంతోనే ఇప్పుడు కమ్ముల సినిమాను అతను తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత మురుగదాస్ మూవీ ఉంటుంది. ఆ తర్వాతే శేఖర్ కమ్ముల సినిమా ఉండచ్చు. ఈ టైంలోనే కమ్ముల హ్యాపీ డేస్ రీమేక్ పూర్తి చేయనున్నాడు.