సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నటిస్తున్న సినిమా ''సర్కారు వారి పాట''. పరశురామ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ కలిసి నిర్మించనున్నాయి. ఇందులో మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటించనుంది. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ తో ఈ సినిమాపై ఆసక్తిని కలిగించారు. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకపోవడంపై ఫిలిం సర్కిల్స్ లో పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు కోవిడ్ కారణంగా ఇన్నాళ్లు సినిమా షూటింగ్ స్టార్ట్ చేయలేదని టాక్ నడిచింది. కానీ ఇప్పుడు అన్ని పెద్ద సినిమాలు షూటింగ్ తిరిగి స్టార్ట్ చేశారు. మహేశ్ కి సరిసమానులైన హీరోలంతా ఇప్పుడు తమ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఒక్క మహేశ్ బాబు మాత్రమే జనవరిలో షూటింగ్, ఫిబ్రవరిలో షూటింగ్ అంటూ వస్తున్నాడు.
'సర్కారు వారి పాట' ను వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయని.. ముందుగా విదేశాల్లో భారీ షెడ్యూల్ కి ప్లాన్ చేసుకున్నప్పటికీ కరోనా చక్కబడకపోవడంతో ఆ షెడ్యూల్ ని వాయిదా వేసుకున్నారని.. ఇప్పుడు హైదరాబాద్ లో చిత్రీకరణ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకపోవడానికి కారణం మహేశ్ పక్కాగా స్క్రిప్ట్ రెడీగా ఉంటేనే షూటింగ్ ప్రారంభించాలనే ప్లాన్ లో ఉండటమే అని టాక్ నడుస్తోంది. కథ రెడీగా లేకపోవడం వల్లనే జాప్యం జరుగుతోందని అంటున్నారు. ఏదేమైనా సినిమాని సెట్స్ పైకి తీసుకెల్లే స్టార్ హీరోల్లో మహేష్ లాస్ట్ అనే చెప్పాలి. కాగా, ఈ చిత్రం బ్యాంక్ స్కాముల నేపథ్యంలో బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని విదేశాలకు పారిపోతోన్న ఆర్థిక నేరగాళ్లను టార్గెట్ చేస్తూ ఉంటుందని టాక్. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు.