మహేష్ బ్రాండ్ గట్టిగానే పడేలా ఉంది

Update: 2018-12-23 05:58 GMT
కెరీర్లో హీరోగా పాతిక సినిమాలు మహర్షితో పూర్తి చేసుకోబోతున్న ప్రిన్స్ మహేష్ బాబు ఇటీవలే ఎఎంబి సినిమాస్ తో మల్టీ ప్లెక్స్ వ్యాపారంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోనే అత్యంత విలాసవంతమైన సినిమా ఎక్స్ పీరియన్స్ గా దీని గురించి ఫీడ్ బ్యాక్ ఇప్పటికే చాలా పాజిటివ్ గా ఉంది. దీన్ని బెంగుళూరు లాంటి ఇతర మెట్రో పాలిటన్ నగరాలకు విస్తరించే ప్రణాళిక ఉన్నట్టు ఎఎంబి పార్టనర్ గా ఉన్న సునీల్ నారంగ్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పడం ఆసక్తి రేపింది.

ఇకపోతే తన పెట్టుబడులను వివిధ రూపాల్లో ప్లాన్ చేసే ఆలోచన మహేష్ సీరియస్ గా చేస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా ఈ ఏడాది విప్లవాత్మక మార్పుకు దారి తీసిన డిజిటిల్ ఎంటర్ టైన్మెంట్ మీద ప్రత్యేక దృష్టిని సారిస్తున్నట్టు వినికిడి. అందులో భాగంగా వెబ్ సిరీస్ లను తక్కువ బడ్జెట్ లో తీయడంతో పాటు మంచి క్వాలిటీతో చిన్న సినిమాలను నిర్మించే ప్లానింగ్ లో ఉన్నట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఒక ప్రముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ సంస్థతో ముందస్తు చర్చలు జరిగినట్టు సమాచారం.

వీలైనంత త్వరగా వచ్చే ఏడాది ప్రారంభంలో ఇవి మొదలు పెడతారు. వాస్తవానికి మహేష్ శ్రీమంతుడుతోనే నిర్మాణ రంగంలోకి వచ్చినప్పటికీ నాన్న కృష్ణ తరహాలో పూర్తి స్థాయిలో దానికే అంకితం కాలేకపోతున్నాడు. అందుకే ఈ రూపంలో తాను లేకపోయినా తన నిర్మాణంలో సినిమాలు రూపొందితే కొత్త టాలెంట్ కు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది ప్లస్ మహేష్ ప్రొడక్షన్ ను కంటిన్యూ గా ఎంగేజ్ చేసినట్టు ఉంటుందని ఇలా ప్లాన్ చేశారట. నాన్న పద్మాలయను బ్రాండ్ గా ఎలా అయితే నిలబెట్టారో ఎంబిని కూడా అలాగే చేయాలనే గట్టి ప్లాన్ లోనే మహేష్ ఉన్నాడు


Tags:    

Similar News