సూపర్ స్టార్ మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. కమర్షియల్ ఎంటర్టైనర్లను మలచడంలో స్పెషలిస్ట్ అయిన అనిల్ రావిపూడి ఈ సినిమాతో మహేష్ కు మరో బ్లాక్ బస్టర్అందించడం ఖాయమని అభిమానులు కూడా ఆశలు పెట్టుకున్నారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అనిల్ ఈ సినిమాగురించి ఇంట్రెస్టింగ్ అంశాలు తెలిపారు.
ఈమధ్య నటించిన సినిమాల్లో మెసేజ్ ఎక్కువగా ఉంటోందని కామెడీ తగ్గుతోందని ఒక కామెంట్ వినిపిస్తోంది. మరి మీ స్టైల్ సినిమాలో మహేష్ ను చూసి చాలా రోజులయింది.. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండబోతోంది. మహేష్ సినిమాల్లో కామెడీ లోటును తీర్చబోతోందా?" అని ప్రశ్నిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఈ సినిమాలో అందరి పాత్రలకు ప్రాధాన్యత ఉంది. విజయశాంతి గారు.. ప్రకాష్ రాజ్ గారు.. మహేష్ అందరూ ఇరగదీశారు. ఈ మధ్యకాలంలో మహేష్ సినిమాలలో ఏది మిస్ అయిందని అనుకుంటున్నారో అది ఈ సినిమాలో ఉంటుంది. ట్రైన్ ఎపిసోడ్ చాలా హిలేరియస్ గా వచ్చింది.. నేను చెప్పడం కంటే మీరు అది తెరపై చూస్తే బాగుంటుంది. ఈ సినిమా ఫుల్ మీల్స్ లాగా ఉండబోతోంది. 360 డిగ్రీస్ లో మహేష్ గారు చించి అవతలేశారు. మహేష్ లాంటి సూపర్ స్టార్ మన సినిమాలో ఉన్నప్పుడు కథ లేకుండా ఊరికే కామెడీ చొప్పిస్తే బాగుండదు. ఈ సినిమాలో అన్నీ ఎలిమెంట్స్ సరిగ్గా కుదిరాయి. మహేష్ పేకాడేశారు" అంటూ సినిమా గురించి గొప్పగా చెప్పారు అనిల్.
కొండారెడ్డి బురుజు అనగానే 'ఒక్కడు' సినిమా గుర్తొస్తుంది మరి ఈ సినిమా లో ఆ ఎపిసోడ్ అలా ఉంటుంది?" అని అడిగితే.. దాదాపు 15 ఏళ్ళు అయినా ఇంకా కొండారెడ్డి బురుజు అనగానే ఒక్కడులో మహేష్ గారి డైలాగ్ గుర్తొస్తుంది. ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అది. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఒక ఎలిమెంట్ ను మా కథలో వాడుకున్నాం. కర్నూలు బ్యాక్ డ్రాప్ లో.. ఆ బురుజు దగ్గరే కొంత కథ సాగుతుంది. ఆ ఎపిసోడ్ ఎవరి అంచనాలకు తగ్గకుండా ఉంటుంది. మహేష్ మాస్ యాక్టింగ్ కూడా ఈ సినిమాలో పర్ఫెక్ట్ గా కుదిరింది" అన్నారు. అనిల్ చెప్తున్న మాటలు చూస్తుంటే 'సరిలేరు నీకెవ్వరు' పై అంచనాలు డబల్ అయ్యేలా ఉన్నాయి.