మహేష్ అందరికీ పంచబోతున్నాడట

Update: 2015-08-11 13:51 GMT
‘శ్రీమంతుడు’ మహేష్ బాబుకు అనేక రకాలుగా ప్రత్యేకమైన సినిమా. రెండు పెద్ద ఫ్లాపుల తర్వాత మహేష్ కు అత్యావశ్యకమైన విజయాన్నందించిందీ సినిమా. అంతే కాదు.. ఈ సినిమాతో మహేష్ నిర్మాతగానూ మారాడు. రెమ్యూనరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా పుచ్చుకోవడానికి అంగీకరించాడు. అతడి నిర్ణయం మంచి ఫలితాన్నే ఇచ్చింది. పైగా పుట్టిన రోజుకు రెండు రోజుల ముందు విడుదలై సూపర్ హిట్ అయింది. మహేష్ కెరీర్ లోనే ‘శ్రీమంతుడు’ బిగ్గెస్ట్ హిట్టయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో మహేష్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోతున్నాడు. ఈ ఆనందాన్ని యూనిట్ సభ్యులందరితో పంచుకోవాలని మహేష్ భావిస్తున్నాడట.

శ్రీమంతుడు యూనిట్ సభ్యులందరికీ ఏదైనా బహుమతి ఇవ్వాలనే ఆలోచనలో మహేష్ ఉన్నాడట. ఇందుకోసం స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మహేష్ కు రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేకపోవడం, ఫారిన్ లొకేషన్ల మాటే లేకపోవడంతో ‘శ్రీమంతుడు’ తక్కువ బడ్జెట్ లోనే పూర్తయింది. బిజినెస్ భారీ స్థాయిలో జరగడంతో నిర్మాతలు ముందే లాభాలు అందుకున్నారు. మహేష్ కూడా లాభాల్లో వాటా రూపంలో తన గత సినిమాలకంటే ఎక్కువ పారితోషకమే అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. నిర్మాతగా తన తొలి సినిమాకే మంచి లాభాలు వస్తున్న నేపథ్యంలో మహేష్ తన యూనిట్ సభ్యులకు బహుమతులివ్వాలని నిర్ణయించుకున్నాడట.

Tags:    

Similar News